Parineeti Chopra With aap leader dating : పొలిటికల్ లీడర్‌తో పరిణీతి చోప్రా డేటింగ్..! వైరల్ అవుతున్న వీడియో..
బాలీవుడ్ హీరోయిన్(Bollywood Heroine) పరిణీతి చోప్రా(Parineeti Chopra) ప్రేమలో పడింది. సీక్రేట్ గా ఓ పొలిటీషియన్ తో.. డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ పరిణితి నిజంగా ప్రేమలో పడిందా..? ఇంతకీ ఎవరా పొలిటీషియన్.

Parineeti Chopra With aap leader dating
బాలీవుడ్ హీరోయిన్(Bollywood Heroine) పరిణీతి చోప్రా(Parineeti Chopra) ప్రేమలో పడింది. సీక్రేట్ గా ఓ పొలిటీషియన్ తో.. డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ పరిణితి నిజంగా ప్రేమలో పడిందా..? ఇంతకీ ఎవరా పొలిటీషియన్.
బాలీవుడ్ హీరోయిన్లలో చూపు తిప్పుకోనివ్వని అందం పరిణీతి చోప్రాది. అందానికి నిలువెత్తు ప్రతిరూపంలా ఉంటుంది పరిణితి. ఇక తన సినిమాలు.. సోషల్ మీడియా పోస్ట్ లతో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను అమాంతంగా పెంచుకుంటూ వెళ్తోంది బ్యూటీ. ముఖ్యంగా బీటౌన్ యూత్(B-Town Youth) తో ఆమె అభిమానులు ఎక్కువగా ఉన్నారు. పరిణితి కూడా ఫ్యాన్స్ తో బాగా కలిసిపోతుంటుంది. తనకు సబంధించిన ప్రతీ విషయాన్ని ఆమె దాదాపు గా అభిమానులకు శేర్ చేస్తుంటారు.
ఇక పరిణితి చోప్రా ప్రేమలో పడ్డట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. పరిణితి ఓ ఎంపీతో ప్రేమలో పడిందట. ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పరిణీతి డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ తెగ షికారు చేస్తున్నాయి. ఓ ఆప్ పార్టీకి సబంధించిన యంగ్ లీడర్(Young Leader) తో ఆమె ప్రేమలో ఉందని ..కలిసి కార్లో షికార్లు కూడా చేస్తుందంటూ వీడియోలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. రీసెంట్ గా .. ఆమ్ ఆద్మీ పార్టీ నేత(APP Leader), పార్లమెంట్ సభ్యుడు రాఘవ్ చద్దా(Raghav Chadha)తో ముంబై(Mumbai)లో కనిపించింది పరిణితీ చోప్రా(Parineeti Chopra). ఇద్దరు సరదాగా షికారుకు వచ్చినట్టున్నారు ఓ రెస్టారెంట్ లో విందు చేసుకుని.. బయటకు వస్తూ.. ఈ ఇద్దరు కెమెరాల కంటికి చిక్కారు. మీడియాకు అడ్డంగా దొరికిపోయారు.
అప్పటి వరకూ పరిణితి ప్రేమ విషయంలో కాస్త అనుమానం ఉండేది. కాని ఇప్పుడు అలాంటిదేం లేదు.. ఈ న్యూస్ పక్కా అంటున్నారు. అయితే ఈ విషయంలో ఈ ఇద్దరు స్టార్లు స్పందించలేదు. తాము రిలేషన్ లో ఉన్నామని ప్రకటించలేదు. ఒక వేళ వాళ్లు బెస్ట్ ప్రెండ్స్ అయ్యి ఉండొచ్చు కదా అంటున్నారు మరికొంత మంది. మొత్తానికి ఈ విషయంలో ఇద్దరిలో ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. ఈ విషయంలో ఎంత నిజం ఉందనేది పరిణీతి, రాఘవల్లో ఎవరు ఒకరు క్లారిటీ ఇచ్చే దాకా తెలియదు.
2011లో లేడీస్ వర్సెస్ రికీ భల్(Ladies vs Ricky Bahl) సినిమాతో తెరంగేట్రం చేసింది పరిణితి చోప్రా. మొదటి సినిమాతోనే తనేంటో నిరూపిస్తూ.. సూపర్ హిట్ కొంట్టేసింది. ఈసినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారాన్ని దక్కించుకుంది బ్యూటీ. ఆ తర్వాత ఇషక్ జాదేతో మంచి హిట్‌ను ఖాతాలో వేసుకుంది పరిణితీ చోప్రా. ఈ సినిమాతో పరిణితికి యూత్ లో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కానీ ఈ మూవీ తర్వాత ఆమెకు వరుసగా ప్లాప్ లు పలుకరించాయి. ఆడలేదు. గత కొన్నేళ్లలో పరిణీతి సాలిడ్ హిట్ కొట్టలేకపోయింది.
