Alia Bhatt sent a special gift for Upasana : ఉపాసనకు బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ స్పెషల్ గిఫ్ట్.. ఏం పంపించిందంటే..
ప్రెగ్నెంట్ గా ఉన్న రామ్ చరణ్ (Ram Charan) భార్య ఉపాసనకు ప్రత్యేక బహుమతి పంపించింది .. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్(Alia Bhatt). గతంలో ఎన్టీఆర్ పిల్లలకు బట్టలు పంపించిన ఆలియా.. ఉపాసనకు ఏం బహుమతి పంపించిందంటే..? పెళ్ళైన 10 ఏళ్ల తరువాత తల్లీ తండ్రులు అవుతున్నారు రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన(Upasana), దాంతో మెగా ఫ్యామిలీలో ఆనందం ఉరకలు వేస్తోంది. అటు మెగా ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు. ఉపాసన తల్లికాబోతుండటం..
ప్రెగ్నెంట్ గా ఉన్న రామ్ చరణ్ (Ram Charan) భార్య ఉపాసనకు ప్రత్యేక బహుమతి పంపించింది .. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్(Alia Bhatt). గతంలో ఎన్టీఆర్ పిల్లలకు బట్టలు పంపించిన ఆలియా.. ఉపాసనకు ఏం బహుమతి పంపించిందంటే..?
పెళ్ళైన 10 ఏళ్ల తరువాత తల్లీ తండ్రులు అవుతున్నారు రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన(Upasana), దాంతో మెగా ఫ్యామిలీలో ఆనందం ఉరకలు వేస్తోంది. అటు మెగా ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు. ఉపాసన తల్లికాబోతుండటం.. ఆర్ఆర్ఆర్ తో రామ్ చరణ్ ఆస్కార్ రేంజ్ కు ఎదిగి గ్లోబల్ స్టార్ గా మారడం ఈ ఏడాదే జరగడంతో వారసుడి రాక తమ ఇంట్లో మంచి జరుగుతుంది అనుకుంటున్నారు మెగా ఫ్యామిలీ. ఉపాసన ప్రెగ్నంట్ కావడంతో.. అటు బందువుల నుంచి ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎన్నో బహుమతులువచ్చి చేరుతున్నాయి.
ప్రస్తుతం దుబయ్ టూర్ లో ఉన్నారు ఉపాసన(Upasana), చరణ్ (Ram Charan). చాలా కాలం తరువాత కాస్త ప్రైవసీ కోసం విదేశాలకు వెళ్ళారు. అక్కడే సెటిల్ అయిన ఉపాసన సిస్టర్స్... ఆమెకు ఘనంగా సీమంతం కూడా చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఉపాసన(Upasana)కు ఫిల్మ్ స్టార్స్ నుంచి వరుసగా బహుమతులు అందుతున్నాయి. రీసెంట్ గా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఉపాసన కోసం స్పెషల్ గా బహుమతులు పంపించింది. ఆర్ఆర్ఆర్(RRR) లో రామ్ చరణ్ జోడీగా ఆలియా నటించింది. ఈ షూటింగ్ టైమ్ లో చరణ్,తారక్ , ఆలియా మంచి స్నేహితులుగా మారారు. ఆచనువుతో ఉపాసనకు బహుమతులు పంపించింది.
లియా భట్ (Alia Bhatt), ఉపాసనకు ఒక క్యూట్ బహుమతి పంపింది. అలియా భట్ Ed-a-Mamma అనే క్లాథింగ్ ప్లాట్‌ఫార్మ్ కి బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తోంది. ఈ ప్లాట్‌ఫార్మ్ లో ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ కిడ్స్ కి సంబంధించిన డ్రెస్సెస్ ఉంటాయి. ఇక ప్రస్తుతం ఉపాసన(Upasana) ప్రెగ్నెన్సీతో ఉండడంతో అలియా Ed-a-Mamma నుంచి ఉపాసనకు, బేబీకి సంబంధించిన డ్రెస్సెస్ గిఫ్ట్ గా పంపించింది. ఈ విషయాన్ని ఉపాసన(Upasana) తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ అలియాకి థాంక్యూ చెప్పింది.