బాలీవుడ్ నటుడు శ్రేయాస్ (Shreyas talpade)గుండెపోటు వార్తతో అందరూ ఉలిక్కిపడ్డారు. ఎప్పుడూ నవ్వుతూ, చక్కిలిగింతలు పెడుతూ ఉండే నటుడు కూడా గుండెపోటుకు(Heart attack) గురవుతాడా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అందరూ శ్రేయాస్ తల్పాడే గురించి ఆందోళన చెందుతున్నారు. శ్రేయాస్ తల్పాడేకు ఏమయ్యిందో.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం(Health) ఎలా ఉందో తెలుసుకోవాలని అందరూ అనుకుంటున్నారు.

'యానిమల్' (Animal)సినిమాతో వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ నటుడు బాబీ డియోల్..(Bobby Deol) శ్రేయాస్ తల్పాడే గురించిన సమాచారాన్ని వెల్లడించాడు. బాబీ మాట్లాడుతూ.. శ్రేయాస్ గుండెపోటు గురించి వార్తలు వచ్చిన వెంటనే తను శ్రేయాస్ భార్య దీప్తి తల్పాడేతో(Deepthi talpade) మాట్లాడి క్షేమం గురించి అడిగినట్లు తెలిపాడు. ఈ సమయంలో దీప్తి చాలా భయపడిందని వెల్లడించాడు. శ్రేయాస్ తల్పాడే గుండె 10 నిమిషాల పాటు ఆగిపోయిందని బాబీ చెప్పాడు. యాంజియోప్లాస్టీ(Angioplasty) అతడి ప్రాణాన్ని కాపాడింది. అతను మళ్లీ జీవితాన్ని పొందాడు. శ్రేయస్ వీలైనంత త్వరగా కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరాడు బాబీ. బాబీ డియోల్ చెప్పిన వార్త విన్న అభిమానులు షాక్ కు గురయ్యారు. అయితే అతడు కోలుకుంటున్నాడన్న వార్త తెలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
శ్రేయాస్ తల్పాడే ఆరోగ్యంపై ఆయన భార్య స్వయంగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రకటన ద్వారా అభిమానులకు కృతజ్ఞతలు(Thanks) తెలిపారు. కోలుకుంటున్న తన భర్తకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం శ్రేయాస్ పరిస్థితి నిలకడగా ఉందని.. మరికొద్ది రోజుల్లో ఆసుపత్రి(Hospital) నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకుంటానని ఆమె వెల్లడించారు. శ్రేయాస్ కోలుకోవడం ఇంకా కొనసాగుతున్నందున తమ గోప్యతను గౌరవించాలని దీప్తి అభిమానులను అభ్యర్థించింది.