బీహార్‌లోని స్థానిక కోర్టు(Bihar Local court) దోసెతో(Dosa) సాంబార్(sambar) ఇవ్వనందుకు రెస్టారెంట్ యజమానికి రూ.3,500 జరిమానా(Fine) విధించింది . 45 రోజుల్లోగా జరిమానా కట్టాలని రెస్టారెంట్ యజమానిని కోర్టు ఆదేశించింది, ఆలస్యం అయితే 8 శాతం వడ్డీ తో కట్టాలని ఆదేశించింది.

మనీష్ అనే ఒక న్యాయవాది తన తల్లితో కలిసి హోటల్ కి వెళ్లి స్పెషల్ మసాలా దోసను పార్సెల్ ఆర్డర్ చేశాడు. మొత్తం బిల్ 140 రూపాయలు పే చేసిన లాయర్ ఇంటికి వెళ్లి చూసేసరికి దోసతో పాటు సాంబార్ ప్యాకెట్ లేదు. కేవలం సాస్ మాత్రమే ఉంది. మరుసటి రోజు రెస్టారెంట్ ఓనర్ ని ఇదే విషయం పై నిలదీసాడు.

దానికి, రెస్టారెంట్ ఓనర్ 140 రూపాయలకి మొత్తం హోటల్ ఇవ్వమంటావా అంటూ విసురుగా సమాధానం చెప్పడంతో ఆగ్రహించిన మనీష్ రెస్టారెంట్‌కి లీగల్ నోటీసు పంపాడు. అయితే, నోటీసుపై రెస్టారెంట్ యాజమాన్యం స్పందించలేదు. దీంతో న్యాయవాది జిల్లా వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. 11 నెలల విచారణ తర్వాత, కోర్టు రెస్టారెంట్‌ ఓనర్ ని దోషిగా నిర్ధారించి, వినియోగదారుకు జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

వినియోగదారుని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసినందుకు రెస్టారెంట్‌కు రూ.2,000 జరిమానా, కోర్ట్ ఖర్చు కింద రూ.1,500 వేర్వేరుగా జరిమానా విధించింది. 45 రోజుల్లోగా జరిమానా చెల్లించాలని రెస్టారెంట్‌ను ఆదేశించింది. సకాలంలో చెల్లించకపోతే 8% వడ్డీ కూడా విడిగా చెల్లించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది.

Updated On 14 July 2023 1:27 AM GMT
Ehatv

Ehatv

Next Story