Big Boss : సోషల్ మీడియాలో తన పేరు మార్చుకున్న పల్లవి ప్రశాంత్
తెలుగు(Telugu) ప్రేక్షకులకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గట్టిగా గుర్తుండిపోతుంది. ఎందుకంటే.. విన్ అవ్వని వారు గొడవలు చేసి రచ్చ చేయడం తెలుసు కాని.. సీజన్ విన్నర్ చేసిన గొడవలకు జైలుకు వెళ్లడం ఇదే ఫస్ట్ టైమ్. ఈసీజన్ రచ్చ రచ్చ జరగ్గా.. గెలచి బయటకు వచ్చిన తరువాత కూడా పల్లవి ప్రశాంత్(Pallavi Prashant) చేసిన హడావిడి.. ఆయన ఫ్యాన్స్ చేసిన రచ్చ పెద్ద ఇష్యూ అయ్యింది.

big boss

ఈ సీజన్‌లో కామన్ మ్యాన్(Common man).. రైతు బిడ్డ. పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. ఇక బిగ్ బాస్(Big Boss) షో సీజన్7 విన్నర్‌కు 35 లక్షల రూపాయల ఫ్రైజ్ మనీతో పాటు ఓ బ్రీజా కార్, జాయ్ అలుక్కాస్ నుంచి 15 లక్షల విలువ చేసే గోల్డ్ ను గిఫ్ట్ గా పొందాడు. అయితే టైటిల్ విన్నర్‌గా నిలిచిన ప్రశాంత్.. ఆ రాత్రి రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. కొందరి సెలెబ్రిటీలా కార్లు ద్వంసం అయ్యాయి. ఆర్టీసీ(RTC) బస్సులు కూడా పగలగొట్టారు. దాంతో వారిపై పోలీసులు కేసులు నమోదుచేయడంతో పాటు.. అరెస్ట్ చేశారు. సుమోటోగా కేసు బుక్ చేశారు.
రీసెంట్ గానే పల్లవి ప్రశాంత్ కు కోర్టు లో ఊరట దక్కింది. అతడికి హైదరాబాద్(Hyderabad) నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక తాజాగా పల్లవి ప్రశాంత్ తన పేరును మార్చుకున్నారు. తన సోషల్ మీడియాలో(Social media) ఈ మార్పులు చేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తన పేరు, బయోను మార్పు చేశారు. ప్రశాంత్‌గా ఉండే పేరు.. MALLA OCHINA, SPY Team Winner అని కొత్తగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేర్చుకున్నాడు. తన బిగ్ బాస్ విజయంలో శివాజీ(Shivaji), యావర్‌ల సాయం మరవలేనిది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరి పేర్లను కలుపుకుని స్పై టీమ్ విన్నర్‌గా మార్చుకున్నట్లు చెబుతున్నారు ఆయన ఫ్యాన్స్.