Big Boss Amardeep : మంచి మనసు చాటుకున్నబిగ్ బాస్ రన్నర్ అమర్ దీప్ చౌదరి.
ఈసారి బిగ్ బాస్(Big Boss) ఎంత రచ్చ అయ్యిందో తెలిసిందే..? బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గొడవలు బయట కూడా వ్యాపించడంతో కేసుల వరకూ వెళ్లాయి. ప్రశాంత్(Pallavi prashant) విన్నర్ అవ్వడంతో.. విజయోత్సవం పేరుతో చూసిన గొడవల కారణంగా అరెస్ట్ చేసి చంచల్ గూడా జైలుకు తరలించారు. ఇక ప్రశాంత్ చేయి కొరికి నెగెటివిటీ మూటగట్టుకున్న అమర్ దీప్(Amardeep) ప్రస్తుతం పాజిటీవ్ వైబ్స్ ను సాధిస్తున్నారు. తాజాగా ఓ మంచి పని కూడా చేసి.. ఆడియన్స్ మనసులు దోచాడు.

బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో రన్నర్ గా నిలిచినటువంటి తెలుగు బుల్లితెర నటుడు అమర్ దీపం ప్రస్తుతం తన సొంత జిల్లా అనంతపురం(Anantapuram) వెళ్లారు. ఈయన తన ఫ్యామిలీతో కలిసి అనంతపురంలో సందడి చేశాడు. బిగ్ బాస్ హౌస్ లో ఉండగా తనకు ఎంతో సహకరించి ఓట్లు వేసి.. సపోర్ట్ చేసి... సోషల్ మీడియాలో(Social media) తనను కాపాడుతూ వచ్చిన తన అభిమానులను కలిసి కృతజ్ఞతలు తెలుపుకున్నారు అమర్.
బిగ్ బాస్ రన్నర్ గా నిలిచిన ఈ సంతోషాన్నిఅనంతపురం ఫ్యాన్స్ తోపంచుకున్నాడు. ప్రస్తుతం అమర్ దీప్ తన భార్య తేజస్వినితో(Tejaswini) పాటు వీరి తల్లిదండ్రులు కూడా అనంతపురంలోనే ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇక అనంతపురంలో అమర్ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలలో పాల్గొని సందడి చేస్తున్నారు. ముఖ్యంగా ఒక సేవ సంస్థతో కలిసి ఈయన ఎంతోమంది పేదవారికి చిన్నపిల్లలకు ఉచితంగా దుప్పట్లను పంపిణీ చేయడమే కాకుండా వారికి అవసరమైనటువంటి వస్తువులను కూడా అందజేశారు. అందరు కలిసి వచ్చినవారకి స్వయంగా భోజనాలు కూడా వడ్డించారు ఇక ఈ కార్యక్రమం తర్వాత అమర్ మాట్లాడుతూ దేవుడు నాకు ఇచ్చిన దానిలో నా శక్తి మేర ఇతరులకు సహాయం చేస్తానని ఈయన తెలియజేశారు.
అమర్ కు రవితేజ(Raviteja) సినిమాలో అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే.. ఇక బిగ్ బాస్ రన్నర్ గా బయటకు వచ్చిన అమర్ కారుపై.. విన్నర్ ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో అమర్ కారు(Car) అద్దాలు పగిలిపోయాయి. ప్రస్తుతం ప్రశాంత్ తో పాటు దాడి చేసిన 14 మందిని జైల్లో పెట్టారు. వారికి బెయిల్ కూడా నిరాకరించినట్టు తెలుస్తోంది.