Samosa Singh Success Story : రోజుకి 12లక్షల ఆదాయం.. ఆ ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేసింది.!
పల్లెల నుండి పట్టణాల వరకు అన్ని చోట్ల జోరుగా సాగె వ్యాపారం ఏమైనా ఉంది అంటే అవి చిరుతిళ్లే . సాయంకాలం అయితే పకోడీ,మిక్చిర్ ,బజ్జి ,సమోసా ఇలాంటివి ఏవో ఒకటి తినాల్సిందే .. ముఖ్యంగా మన సిటీ వాళ్లకు కూడా జాబ్ మధ్యలో ఉండే బ్రేక్ టైం లో ఛాయ్ తో పాటు సమోసా ఉండాల్సిందే . ఇంటికి చుట్టాలు వస్తే కంగారు పడి ఇప్పుడు ఏమి చేయాలి అని ఆలోచించే రోజులు పోయాయి. పొయ్యదగ్గరే ఉండిపోనక్కరలేదు హ్యాపీ గా కూర్చొని ఇంట్లో నుండే ఆర్డర్ చేసే రోజులు వచ్చాయి . అలాగే వ్యాపారం లో పోటీ తో పాటు ఆకర్షించే విధానం కూడా మారింది. రొటీన్ కి బదులు విభిన్నంగా రుచిని అందించాలనే తపనతో ముందుకు వెళ్తున్నారు ఫుడ్ రంగంలో వ్యాపారస్తులు .

samosa singh
పల్లెల నుండి పట్టణాల వరకు అన్ని చోట్ల జోరుగా సాగె వ్యాపారం ఏమైనా ఉంది అంటే అవి చిరుతిళ్లే . సాయంకాలం అయితే పకోడీ,మిక్చిర్ ,బజ్జి ,సమోసా ఇలాంటివి ఏవో ఒకటి తినాల్సిందే .. ముఖ్యంగా మన సిటీ వాళ్లకు కూడా జాబ్ మధ్యలో ఉండే బ్రేక్ టైం లో ఛాయ్ తో పాటు సమోసా(samosa) ఉండాల్సిందే . ఇంటికి చుట్టాలు వస్తే కంగారు పడి ఇప్పుడు ఏమి చేయాలి అని ఆలోచించే రోజులు పోయాయి. పొయ్యదగ్గరే ఉండిపోనక్కరలేదు హ్యాపీ గా కూర్చొని ఇంట్లో నుండే ఆర్డర్ చేసే రోజులు వచ్చాయి . అలాగే వ్యాపారం లో పోటీ తో పాటు ఆకర్షించే విధానం కూడా మారింది. రొటీన్ కి బదులు విభిన్నంగా రుచిని అందించాలనే తపనతో ముందుకు వెళ్తున్నారు ఫుడ్ రంగంలో వ్యాపారస్తులు . అందరిలా కాకుండా ఆకట్టు కొనే విధంగా వినూత్నంగా ఆలోచించే వాళ్లకి తిరుగే ఉండదు ఫుడ్ బిజినెస్(food business) లో . అందరు అమ్మే ఐటమ్ అయిన దాన్ని ప్రెసెంట్ చేసే స్టైల్ లో కాస్త తేడా ,రుచి ఉంటే ఈ రోజుల్లో ఎంత దూరం అయిన కస్టమర్లు వస్తారు .దాని కోసం సరైన ప్రణాళిక కొంచెం పెట్టుబడి మనో దైర్యం తో అడుగేయాలి . ఇలానే ఒక జంట సమోసా వ్యాపారంలో కోట్లు గడిస్తున్నారు . రోజు లక్షల్లో వ్యాపారాన్ని చేస్తున్నారు. సమోసా సింగ్ ఈ పేరు ఉన్న ఔట్లెట్(outlet) మీరు చూసే ఉంటారు. ఒక సామాన్య మానవునికి లంచ్ లేదా డిన్నర్ గా ఉంటుంది సమోసా చాల ప్రాంతాల్లో .. వాళ్ళకి వచ్చిన ఐడియా ఏంటి ?ఎలా ఈ వ్యాపారంలో ఇంత సక్సెస్ ఎలా చూసారు? .ఏంటి వీళ్ళ సమోసా ప్రత్యేకత ఆ కథ ఏంటో చూసేద్దాం .
-
- సమోసా సింగ్ (samoa singh)అనే ఆలోచన ఎవరిదీ అంటే నిధి సింగ్(nidhi singh) మరియు ఆమె భర్త శిఖర్ వీర్ సింగ్ (sikhar veersingh)అనే బెంగుళూరుకు చెందిన జంట. నిధి సింగ్, శిఖర్ వీర్ సింగ్.. వీరిద్దరూ ప్రేమికులు . హర్యానాలో బీటెక్ చదువుతున్న సమయంలో వీరిద్దరికి పరిచయమైంది. అది ప్రేమకు దారితీసి.. ఏడడుగుల బంధానికి దగ్గరచేసింది. వారు ఉన్నత ఉద్యోగాన్ని విడిచిపెట్టి, సమోసాల వ్యాపారాన్ని ప్రారంభించేందుకు తమ ఇంటిని కూడా అమ్మి, ఈరోజు రోజుకు రూ. 12 లక్షలు(12lakhs) సంపాదిస్తున్నారు.
-
- శిఖర్‌కు సమోసాలు అమ్మాలి అనే ఆలోచన అతను చదువుతున్నప్పుడు వచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖల బయట సమోసాలుఅమ్మితే బాగుంటుంది అనే కల ఉండేదట . కానీ, తన ఆలోచన ఎవరికైనా చెపితే ఎలా ఉంటుందో , తన చదువుతున్న చదువుకి సమోసా అమ్మడం ఏంటి అంటారు అనుకున్నాడు అందరిలాగానే . ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని, చదివిన చదువుకు అనుగుణంగా అతను సైంటిస్ట్(scientist) అవ్వాలని డిసైడ్ అయ్యాడు . 2015లో ఒకరోజు, ఫుడ్ కోర్ట్‌లో(food court) సమోసా కోసం ఏడుస్తున్న అబ్బాయిని చూసినప్పుడు, అతను మళ్ళీ అందరికి ఎంతో ఇష్టమైన సమోసా బిజినెస్ (business)ఖచ్చితంగా చేయాలి అని ఫిక్స్ అయ్యాడు . వెంటనే తన జాబ్ ని విడిచి , బెంగళూరుకు వెళ్లి, 'సమోసా సింగ్'ని ప్రారంభించాడు. ఆ సమయంలో, నిధి సింగ్ కూడా గురుగ్రామ్‌లోని ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో వార్షిక రూ. 30 లక్షలప్యాకేజీతో పనిచేస్తుంది .
-
- ఉద్యోగం నుండి వ్యాపారానికి మారడం ఆ దంపతులకు అంత సులభంగా జరగలేదు . కానీ, వ్యాపారాన్ని ప్రారంభించడానికి వారు తమ పొదుపుచేసిన మొత్తం డబ్బుని పెట్టుబడిగా ఉపయోగించడంతో వారు విజయం(success) సాధించారు, తరువాత, వ్యాపారం పెరిగినప్పుడు ,వంటగదికి(kitchen) పెద్ద స్థలం అవసరమైనప్పుడు, వారు తమ అపార్ట్మెంట్ ఫ్లాట్‌ను(apartment) కూడా అమ్మేయాల్సి వచ్చింది. దీనికి వీరు ఏ మాత్రం ఆలోచించలేదు , బెంగళూరులో(bengaluru) ఒక ఫ్యాక్టరీని(factory)అద్దెకుతీసుకున్నారు.అందరిలానే ఒత్తిళ్లను ఎదుర్కొన్నారు .సమస్యలను సవాళ్ళగా తీసుకొని వారు ఊహించుకున్న కలల సామ్రాజ్యన్ని కట్టుకున్నారు .
-
- ఈ రోజు భారతదేశం(india) అంతటా 40కి పైగా అవుట్లెట్లతో, ఆలూ సమోసా ,కార్న్ సమోసా సాధారణ రుచులతో పాటు విభిన్నమైన బటర్ చికెన్ సమోసా(butterchickensamosa) మరియు కడాయి పనీర్ సమోసాలతో(panner samosa) బాగా పాపులర్ అయ్యారు. ఈ రుచి అలవాటు పడిన జనాలు సమోసా సింగ్(samosa singh) కు క్యూ కట్టేవారు . మరియు ఇప్పుడు తమ వ్యాపారాన్ని మరిన్ని రుచులతో మరియు మరెన్నో నగరాల్లో విస్తరించేలా చేయాలన్న ప్లాన్ చేస్తున్నారు. వారు పానీ పూరీ, దహీ పూరీ, మసాలా పూరీ, వడ పావ్, దబేలీ, సమోసా ప్లాటర్, జజీరా, గులాబ్ జామూన్, మూంగ్ దాల్ హల్వా (moongdal halwa)లాంటివి కూడా అమ్మడం జరుగుతుంది .వ్యాపారం వృత్తిలో కలలు కనడం చాల మంది చేస్తారు కానీ వాటిని సార్ధకం చేసుకోవాలంటే సంకల్పం తో పాటు నమ్మకం,ధైర్యం సరైన అవగహన పట్టుదల కూడా కావాలి . సవాళ్ళను ఎదుర్కొని ప్రస్తుత పోటీని తట్టుకొని ముందుకెళ్లే తెలివి కూడా అవసరం అపుడే ఏ రంగం లో అయినా సక్సెస్ (success)సాధిస్తారు అనడానికి ఈ జంట అందరికి స్ఫూర్తి
