Bengaluru News:పెళ్ళాం పడుకుందని పోలీసులకు కంప్లైంట్ చేసాడు .. ఎం జరిగిందంటే.?
భార్య ప్రవర్తనతో విసిగిపోయాడు ఒక భర్త. ఇక ఐదేళ్లుగా తాను పడుతున్న నరకయాతన భరించలేక పోలీసులకు తన భాద చెప్పుకున్నాడు . ఈ సంఘటన కర్ణాటక బెంగళూరు లో బసవగుడి లో చోటు చేసుకోండి .
భార్య ప్రవర్తనతో విసిగిపోయాడు ఒక భర్త. ఇక ఐదేళ్లుగా తాను పడుతున్న నరకయాతన భరించలేక పోలీసులకు తన భాద చెప్పుకున్నాడు . ఈ సంఘటన కర్ణాటక బెంగళూరు లో బసవగుడి లో చోటు చేసుకోండి .
భర్తల అకృత్యాలకు నలిగిపోతున్న భార్యాల వేదన మనం తరచు వార్తల రూపంలో చూస్తుంటాం. కానీ భార్యల వలన నలిగిపోయే భర్తలు కూడా చాల మంది మన సమాజం లో ఉన్నపటికీ ,భరించేవాడే భర్త అన్నదానికి నిదర్శనం గా చాల చోట్ల మగవాళ్లు ఆడవాళ్లు గురించి కంప్లైంట్ చేసే అంత పరిస్థితులు అంత గా చోటు చేసుకున్నది లేదు.కానీ కర్ణాటక లో ఒక భర్త తన భాదను పెళ్ళైన నాటి నుండి భరిస్తూనే ఉన్నాడు. ఇంతకు ఆ భార్య అంతలా ఎం చేసింది అనుకుంటున్నారా??
ఆమె ఒక గృహిణి .సాధారణంగా ఆడవాళ్లు ఇంటి పనుల్లో పడి తిండి నిద్ర మర్చిపోతుంటారు.కానీ ఈవిడ కాస్త రివర్స్ తిండి నిద్ర లో పడి ఏకంగా సంసారాన్ని మర్చిపోయింది అని బాధపడుతున్నాడు ఆ భర్త. తన భార్య రాత్రి నిద్రపోతే తిరిగి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు నిద్రలేవదని ,సాయంత్రం నిద్రపోతే అర్ధరాత్రి వరకు నిద్రలేవదని వంట కూడా చెయ్యదు అట . తన తిండి బాగోగులు తన తల్లి చూసుకొంటుందట .. ఒకసారి ఇదేం ప్రవర్తన అని నిలదీస్తే .. పుట్టినరోజు నెపంతో తన ఇంటివాళ్లను 20-25 మంది ని ఇంటికి పిలిచి ఇంటి వాళ్ళ చేత భార్య దాడి చేయించింది. అలాగే పెళ్ళికి ముందే తనకు ఉన్న రోగాలని దాచి పెళ్లి చేసారని ,అలాగే ఆస్థి కోసం మాత్రమే పెళ్ళిచేసుకోంది అలాగే తనని హింసిస్తుందని అని పోలీసులు దగ్గర వాపోయాడు ఆ భర్త ఇమ్రాన్ ఖాన్ . తన ఇక చేసేది ఏమి లేక పోలీసులును ఆశ్రయించాడు ఆ భర్త .తన మామ,అత్తా,బావమరిది మీద కంప్లైంట్ చేసాడు . ఈ ఘటన బెంగళూరు బసవగుడి లో చోటు చేసుకుంది .