మీరు కోటీశ్వరులు అయ్యారని.. ఎవరైనా అకస్మాత్తుగా మీకు ఫోన్ చేసి అభినందనలు చెబితే.. ప్ర‌స్తుత‌మున్న ప‌రిస్థితుల‌లో ఏదో ఆఫర్ ముసుగులో మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని భావిస్తాం. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి కూడా అలాగే చేశాడు

మీరు కోటీశ్వరులు అయ్యారని.. ఎవరైనా అకస్మాత్తుగా మీకు ఫోన్ చేసి అభినందనలు చెబితే.. ప్ర‌స్తుత‌మున్న ప‌రిస్థితుల‌లో ఏదో ఆఫర్ ముసుగులో మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని భావిస్తాం. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి కూడా అలాగే చేశాడు. అరుణ్ కుమార్ వట్కే కోరోత్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుతాడని అనుకోలేదు. అది జరిగింద‌ని కాల్ రావ‌డంతో.. ఎవరో ఆక‌తాయిత‌నంతో చేసుంటార‌ని అతను భావించాడు.

బెంగళూరు నివాసి అరుణ్ కుమార్ వట్కే కోరోత్ తన స్నేహితుల ద్వారా అబుదాబి బిగ్ టికెట్ లైవ్ డ్రా లాటరీ షో గురించి తెలుసుకున్నాడు. తన అదృష్టాన్ని పరీక్షించుకుందామ‌ని టికెట్ కొన్నాడు. మొదటి సారి టికెట్ కొన్నప్పుడు అతనికి ఏమీ రాలేదు. అతను మార్చి 22న రెండోసారి బిగ్ టికెట్ లైవ్ డ్రా లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు. అయితే తను కొన్న లాటరీ టికెట్ త‌న ద‌శాదిశ‌ను మార్చేస్తుంద‌ని ఊహించ‌లేదు. కానీ.. ఈ సారి అదృష్టం తలుపు తట్టడంతో పాటు గొళ్ళెం పగలగొట్టి లోపలికి వ‌చ్చేసింది. తను రెండోసారి లాటరీ టిక్కెట్ కొన్న‌ప్పుడు.. ఎవరికి అదృష్టం వ‌రిస్తుందో ఏమోన‌ని అరుణ్ కుమార్ భావించాడు. కానీ, అతనే ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు.

బిగ్ టికెట్ లైవ్ డ్రా లాటరీ షో హోస్ట్ అరుణ్‌కు గ్రాండ్ ప్రైజ్ విన్ గురించి తెలియజేయడానికి కాల్ చేశాడు. 20 మిలియన్ దిర్హామ్‌ల గ్రాండ్ ప్రైజ్‌ని గెలుచుకున్నార‌నిని అరుణ్‌కు చెప్పాడు. అరుణ్ వెంట‌నే అది బూటకపు కాల్ అని భావించి కాల్‌ని క‌ట్ చేశాడు. వెంట‌నే నంబర్‌ను కూడా బ్లాక్ చేశాడు. ఆ తర్వాత రెండో నంబర్‌ నుంచి అరుణ్‌కి కాల్‌ రావడంతో లాటరీ తగిలిందన్న నమ్మకం కలిగింది. అరుణ్ కుమార్ ఖలీజ్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. "నాకు బిగ్ టిక్కెట్ నుండి కాల్ వచ్చినప్పుడు.. అది ఫేక్ కాల్ అని అనుకున్నాను.. ఎవరైనా ఆక‌తాయిత‌నంగా ఆడుకుంటున్నార‌ని భావించాను" అని అన్నారు.

బిగ్ టికెట్ లైవ్ డ్రా లాటరీలో అరుణ్ 20 మిలియన్ దిర్హామ్‌లను గెలుచుకున్నాడు. భారతీయ కరెన్సీలో దీని విలువ దాదాపు 44 కోట్ల 61 లక్షల రూపాయలకు పైగా ఉంటుంది. బిగ్ టికెట్ అబుదాబి కూడా తమ ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని ధృవీకరించింది. గెలిచిన డబ్బుతో తన ఇన్నేళ్ల కలల‌ను నెరవేర్చుకుంటానని.. సొంతంగా వ్యాపారం ప్రారంభిస్తానని అరుణ్ కుమార్ చెప్పారు.

Updated On 5 April 2023 11:49 PM GMT
Ehatv

Ehatv

Next Story