The love story of Kajal and Bhavna:వారి ప్రేమకు చట్టపరమైన గుర్తింపు రావాలంటూ తిరుగుబాటు చేస్తున్న ..ఇద్దరమ్మాయిల ప్రేమ కథ .!
ప్రేమ గెలిస్తే అది చరిత్ర కాలేదు . ఓడిపోయిన ప్రేమకథలు మాత్రమే చరిత్రను సృష్టిస్తాయి . అలాంటి ప్రేమకధలో ఇద్దరు ప్రేమికులు ప్రస్తుత సమాజంలో తమ ప్రేమను నిలుపు కోవటానికి ,గుర్తింపు పొందటానికి పోరాటం చేస్తున్నారు . ప్రేమలో ఒక్కోసారి కులం, ఒక్కోసారి మతం కొన్నిసార్లు ఆస్తులు ,అంతస్థులు అడ్డుగోడలవుతాయి . అయితే ఈ లవ్ స్టోరీ కాస్త డిఫరెంట్. ఇది ఇద్దరమ్మాయిల ప్రేమకథ . కాజల్ చౌహాన్, భావా సింగ్ ల ప్రేమకథ ఇది. ఇద్దరు అమ్మాయిలు తమ ప్రేమను గుర్తించాలంటూ చేస్తున్న తిరుగుబాటు కథ . ఇలాంటి ప్రేమ నిజానికి చట్ట విరుద్ధం. ప్రస్తుతం స్వలింగ వివాహాలను ఏమాత్రం ప్రోత్సహించామని కేంద్రం తేల్చి చెప్పింది.అయితే ఈ తీర్పు పై సరైన స్పష్టత ఇంకా రాలేదు . కాజల్ చౌహాన్ , భావనా సింగ్ ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అలాగే స్వలింగ వివాహానికి చట్టపరమైన గుర్తింపు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన 20 స్వలింగ జంటలలో వీరుకూడా ఒక జంట .
ప్రేమ గెలిస్తే అది చరిత్ర కాలేదు . ఓడిపోయిన ప్రేమకథలు మాత్రమే చరిత్రను సృష్టిస్తాయి . అలాంటి ప్రేమకధలో ఇద్దరు ప్రేమికులు ప్రస్తుత సమాజంలో తమ ప్రేమను నిలుపు కోవటానికి ,గుర్తింపు పొందటానికి పోరాటం చేస్తున్నారు . ప్రేమలో ఒక్కోసారి కులం, ఒక్కోసారి మతం కొన్నిసార్లు ఆస్తులు ,అంతస్థులు అడ్డుగోడలవుతాయి . అయితే ఈ లవ్ స్టోరీ కాస్త డిఫరెంట్. ఇది ఇద్దరమ్మాయిల ప్రేమకథ . కాజల్ చౌహాన్, భావా సింగ్ ల ప్రేమకథ ఇది. ఇద్దరు అమ్మాయిలు తమ ప్రేమను గుర్తించాలంటూ చేస్తున్న తిరుగుబాటు కథ . ఇలాంటి ప్రేమ నిజానికి చట్ట విరుద్ధం. ప్రస్తుతం స్వలింగ వివాహాలను ఏమాత్రం ప్రోత్సహించామని కేంద్రం తేల్చి చెప్పింది.అయితే ఈ తీర్పు పై సరైన స్పష్టత ఇంకా రాలేదు . కాజల్ చౌహాన్(kajal chauhan) , భావనా సింగ్ (bhavana singh)ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అలాగే స్వలింగ వివాహానికి చట్టపరమైన గుర్తింపు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన 20 స్వలింగ జంటలలో వీరుకూడా ఒక జంట .
5 సంవత్సరాల క్రితం, 2018లో కాజల్ చౌహాన్ మరియు భావా సింగ్ వివాహ వేడుకలో మొదటిసారి కలుసుకున్నారు. ఇద్దరూ మొదటి చూపులోనే ప్రేమలో పడ్డారు. ఇద్దరూ వేర్వేరు రాష్ట్రాలకు చెందినవారు. అప్పుడు కాజల్ వయసు 23 ఏళ్లు, భావనకు 18 ఏళ్లు. ఇద్దరూ కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు .తరచు గంటల కొద్దీ మాటలు . చాటింగ్ చేసుకునేవాళ్ళు . ఇంట్లో వాళ్ళకి వీళ్ళ వైఖరి అర్థమైంది . కుటుంబసభ్యులు మందలించారు . అయినా రహస్యంగా చాటింగ్ చేస్తూ ఉండేవాళ్ళు . అదికూడా తెలిసి ఇంట్లో వాళ్లు ఈ సారి మరింత గట్టిగా మందలించారు . ఇంట్లో వారి హింసతో విసిగిపోయిన భావన, ఇంటి నుండి పారిపోయి పంజాబ్(Punjab) లో కాజల్ చౌహాన్ ఇంటికి చేరుకుంది . భావన వయస్సు లో ఇంకా చిన్నదే . భావన ఇంటి సభ్యులు రెండురోజుల్లోనే ఈ విషయాన్ని పసిగట్టి అక్కడకు చేరుకొని ఇద్దరిని విడదీసి మళ్లీ ఇలాంటి పనులు చేస్తే చంపేస్తామని బెదిరించారు .భావనను బలవంతంగా ఇంటికి తీసుకువచ్చారు కాజల్ జ్ఞాపకలతో బాధగా ,ఒంటరిగా, తనలో తానే ఎంతగానో కుమిలిపోయేది .తన భాదను ఎవరితో పంచుకోవాలో తెలియదు. తన ప్రేమను ఎవరు అర్థంచేసుకుంటారో తెలియదు .ఇలా ఇద్దరిమధ్య ఎడబాటుతో ,వేదనతో ఒకటిన్నర రెండు నెలలు గడిచిపోయాయి.
ఆ తర్వాత 6 సెప్టెంబర్ 2018న స్వలింగ సంపర్కం పైన సుప్రీంకోర్టు (supreme court)కీలక వ్యాఖ్యలు చేసింది . స్వలింగ సంపర్కాన్ని నాన్-క్రిమినల్‌గా ప్రకటిస్తూ న్యాయమూర్తులు చేసిన బోల్డ్ స్టేట్‌మెంట్‌లు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వార్తాపత్రికలకు ముఖ్యాంశాలుగా మారాయి. దీంతో నిరాశలో ఉన్న ఈ ఇద్దరు ప్రేమికులకు కొత్త ధైర్యం వచ్చింది. ఇద్దరూ తమ ప్రేమను పరిపూర్ణం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. ,రకరకాల బెదిరింపులను ఎదురించి ఏది ఏమైనా ఇద్దరూ కలిసే జీవించాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి జీవించడం ప్రారంభించారు. అయితే కుటుంబ సభ్యుల భయంతో ఒకచోటు నుండి మరోచోటుకు ప్లేస్ మార్చుకుంటూనే చాన్నాళ్లు జీవనాన్ని గడిపారు . కొన్నిసార్లు చావు బెదిరింపులు మరి కొన్నిసార్లు భయంకరమైన పరిస్థితులు వారిని వెంటాడుతూనే ఉన్నాయి .
ఇరువురి కుటుంబాలు వారిని విడదీసేందుకు చేయని ప్రయత్నము లేదు .ఒక పత్రిక ఇంటర్వ్యూ లో భావా సింగ్ మాట్లాడుతూ, 'నా కుటుంబం మమ్మల్ని బాధపెట్టడం ఎప్పుడూ ఆపలేదు. మేమిద్దరం దూరమైతే కొన్ని రోజులకి వేరే వ్యక్తి తో పెళ్లి చేసుకున్నాక పరిస్థితులు అన్ని మారతాయని పదే పదే చెప్పడంతో మేము చాల విసిగిపోయాము . నాలుగు సంవత్సరాల నుండి ఇదే జరుగుతున్నప్పటికీ వారి మనసుల్లో ప్రేమ చెక్కు చెదరలేదు .ఎలా అయిన పెళ్లి చేసుకుని దానికి చట్టం ద్వారా కూడా గుర్తింపు లభిస్తే వారి ప్రేమకు భద్రత లభిస్తుందని వారు పోరాడుతున్నారు . అయిదు సంవత్సరాల తర్వాత, ఇప్పటికి ఇద్దరూ తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లడానికి కోర్టుతో ,సమాజంతో ,కుటుంబంతో పోరాటం చేస్తూనే ఉన్నారు ఈ జంట . తమ వివాహానికి చట్టపరమైన గుర్తింపు వచ్చేలా 1954 నాటి ప్రత్యేక వివాహ చట్టాన్ని మార్చాలని సుప్రీంకోర్టును (supreme court)కోరుతూ పిటిషన్ దాఖలు చేసారు . స్వలింగ సంపర్క వివాహాలను కేంద్రం వ్యతిరేకిస్తోంది. పరిస్థితులు ఎలా ఉన్న ప్రస్తుతానికి కాజల్ చౌహాన్,భావన సింగ్ కథ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ న్యూస్ లా మారింది