దేవుడు అందరికి ఎదో ఒక మంచి రోజు ఇస్తాడు . కాకపోతే ఎవరి వంతు వచ్చే వరకు వాళ్ళు ఎదురుచూడాల్సిందే . ఎవరి అదృష్టం ఎప్పుడు మారుతుందో చెప్పడం కష్టం. బీహార్‌లోని పూర్నియా జిల్లాలో అలాంటి ఒక ఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది అక్కడ ఒక ఆటో డ్రైవర్ రాత్రి కి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. IPL మ్యాచ్ డ్రీం 11 (IPL Match dream 11)ఆటో డ్రైవర్ నౌషాద్ (Naushad)అదృష్టాన్ని మార్చింది. పూర్నియాలోని (poorniya)దగ్రువా బ్లాక్‌లోని మజ్‌గామా పంచాయతీలోని కన్హరియా గ్రామానికి చెందిన కాసిమ్ అన్సారీకి చెందిన నౌషాద్‌కు క్రికెట్ (cricket)గురించి పెద్దగా తెలియదు అసలు దాని గురించి ఏబీసీడీ కూడా తెలియదు. కానీ క్రికెట్ ఐపీఎల్‌లో డ్రీమ్ 11 (IPL Match dream 11)ఆడి కోటీశ్వరుడు అయ్యాడు.

నౌషాద్ ఆటో నడుపుకుంటూ జీవనాన్ని సాగించే అతి సామాన్యమైన వ్యక్తి . అతని అన్నదమ్ముల్లో ఒకరు అతనికి డ్రీమ్ 11 ఆడమని సలహా ఇచ్చాడు . 2021 నుండి, అతను డ్రీమ్ 11లో డబ్బును పెట్టుబడి పెట్టాడు. కాగా, ఏప్రిల్ 5న పంజాబ్, రాజస్థాన్ (Punjab Vs Rajasthan) మధ్య జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లో(IPL Cricket Match) నౌషాద్ రూ.39 తో గేమ్ ఆడాడు. తరువాత అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు . సరైన సమాధానం చెప్పినందుకు రాజస్థాన్ (Rajasthan)జట్టు నుంచి కోటి రూపాయల (one crore)పారితోషికం అందుకున్నాడు.

ఇందులో రూ.30 లక్షల జీఎస్టీ (GST)మినహాయించగా రూ.70 లక్షలు తన ఖాతాలో ఇప్పటికే జమ చేయబడ్డాయి . ఇప్పుడు ఆ డబ్బుతో ఇల్లు కట్టుకుని పిల్లలను చదివించుకుంటాడు. హాయిగా జీవనాన్ని సాగిస్తున్నాడు కానీ, అంతకుముందు కూడా ఆటో నడిపేవాడిని, భవిష్యత్తులో కూడా ఆటో నడుపుతూనే ఉంటాను అని నౌషాద్(Noushad) చెప్పడం విశేషం .ఆన్లైన్ క్రికెట్ఆడి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుతానని ఎప్పుడు అనుకోలేదని నౌషాద్ అన్నాడు. అతను క్రికెట్ ఎప్పుడు బయట ఆడలేదు లేదా క్రికెట్ పట్ల ఆసక్తి చూపలేదు. ఇందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాడు . మరోవైపు దేవుడి దయ వల్లే ఇదంతా జరిగిందని నౌషాద్ తండ్రి కాసిం అన్సారీ, తల్లి కుంకుమ్ ఖాతూన్ తెలిపారు. నౌషాద్ కుటుంబం కూలీ పనికి వెళ్లే చిన్న రైతులు. కొడుకు ఆటో నడుపుతూ కుటుంబాన్నిపోషించేవాడు .

నౌషాద్‌ మొబైల్‌లో గేమ్స్‌ (Mobile games)ఆడేటప్పుడు తల్లి తండ్రులు చాలాసార్లు అడ్డుపడ్డారట , ఇప్పుడు కోటి రూపాయల పారితోషికం రావడంతో కుటుంబంతో పాటు గ్రామంలో అందరు చాలా సంతోషం గా ఉన్నారని తల్లిదండ్రులు తెలిపారు. పైన ఉన్నవాడి చేతిలో అదృష్టం ఉంటుందని నౌషాద్ (Naushad)తల్లితండ్రులు చెప్పారు . పేద ఆటోడ్రైవర్ అయిన నౌషాద్ ఈ విధంగా కోటీశ్వరుడు అవుతాడని ఎప్పుడు అనుకోలేదు. అయితే ఈ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్‌లో చాలా మంది మిలియనీర్లు కూడా అవుతారు. కానీ నౌషాద్ లాంటి అదృష్టవంతులు చాలా తక్కువ మంది ఉంటారు.. ఇది ఇలా ఉండగా కేంద్రం కొన్ని ఆన్లైన్ బెట్టింగ్ యాప్(betting apps) లను త్వరలోనే నిషేదిస్తునట్లు ప్రకటించింది .

Updated On 8 April 2023 5:07 AM GMT
rj sanju

rj sanju

Next Story