Who Gives A Crap : బ్రేకప్ లవర్స్‌కు ఓ కంపెనీ జబర్దస్త్ ఆఫర్..!
ప్రేమికుల దినోత్సవానికి(Lovers Day) జరపుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా యువతీయువకుఉ సిద్ధమయ్యారు. ఫిబ్రవరి నెలలో ప్రేమికుల్లో కొత్త ఉత్సాహం వస్తుంది. తమ ప్రేయసీ లేదా ప్రేమికుడికి బహుమతులను కొనుగోలు చేయడంలో బిజీగా ఉంటారు. ప్రేమికుల దినోత్సవం నాడు ఒకరినొకరు కలుసుకుని విషెస్ చేస్తూ షికార్లకు వెళ్తుంటారు.
ప్రేమికుల దినోత్సవానికి(Lovers Day) జరపుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా యువతీయువకుఉ సిద్ధమయ్యారు. ఫిబ్రవరి నెలలో ప్రేమికుల్లో కొత్త ఉత్సాహం వస్తుంది. తమ ప్రేయసీ లేదా ప్రేమికుడికి బహుమతులను కొనుగోలు చేయడంలో బిజీగా ఉంటారు. ప్రేమికుల దినోత్సవం నాడు ఒకరినొకరు కలుసుకుని విషెస్ చేస్తూ షికార్లకు వెళ్తుంటారు. అందుకు తగ్గట్టుగా బహుమతులు ఇస్తూ ఆనందిస్తుంటారు. అయితే ఇది నాణానికి ఒక వైపు మాత్రమే.
కానీ ప్రేమలో విఫలమైనవారికి ఫిబ్రవరి నెల విషాదంగా ఉంటుంది. ప్రేమలో విఫలమై బ్రేకప్ చేసుకున్నవారు కొందరైతే.. ప్రేమలో మోసపోయి కొందరు బ్రేకప్ చేప్పుకుంటారు. ఒకరినొకరు ఇచ్చిన బహుమతులను ఉంచుకోవాలో బయటపడేయాలో తెలియక సతమతమవుతుంటారు. కొందరు తమ ఎక్స్‌కు గుర్తుగా వారిచ్చిన గిఫ్టులను ఉంచుకుంటే.. కొందరు తాము మోసపోయామన్న బాధలో ఉంటే ఇవి ఇంకా ఎక్కువ బాధ పెడుతాయని లోలోన మదనపడుతుంటారు. అయితే ఈ బ్రేకప్(Break UP) బాధలను పొగొట్టేందుకు ఓ కంపెనీ ముందుకొచ్చింది. 'హు గివ్స్ ఏ క్రాప్'(Who Gives A Crap) అనే సంస్థ బ్రేకప్ బాధలను తొలగగించుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. హూ గివ్స్ ఎ క్రాప్ రీసైకిల్ చేసే టాయిలెట్ పేపర్ కంపెనీ ఇది. ఇది మీ మాజీ ప్రేమికుల ఇచ్చిన బహుమతులు, జ్ఞాపకాలను ఫ్లాష్ చేస్తుంది. పాత ప్రేమ లేఖలు, గ్రీటింగ్ కార్డ్‌లు, వాట్సాప్ చాట్‌ల ప్రింట్‌అవుట్‌లను టాయిలెట్ రోల్స్‌గా మార్చి కంపెనీ విక్రయిస్తోంది. మీ పాత చెడు జ్ఞాపకాలను కూడా వదిలించుకోవచ్చు. దీనికి కంపెనీ తన ప్లాన్‌కు 'ఫ్లాష్ యువర్ ఎక్స్'(Flush Your Ex) అని పేరు పెట్టింది. మీ ప్రేమ లేఖలను మాకు మెయిల్ చేస్తే వాటిని ప్రచారం కోసం ఉపయోగించడమే కాకుండా.. టాయిలెట్ పేపర్‌గా(Toilet Paper) మారుస్తామని కంపెనీ తెలిపింది. ఫిబ్రవరి 29 వరకు లేఖలు పంపేందుకు అవకాశం ఉందని తెలిపింది. చెడు జ్ఞాపకాలను టాయిలెట్‌లో ఉంచడం ఉత్తమం అని కంపెనీ ప్రకటనలో తెలిపింది. మీ మాజీ ప్రేమికుల నుంచి వచ్చిన ప్రేమలేఖలు, మెయిల్స్, వాట్సాప్ మెసేజెస్, ఇంకా వారి జ్ఞాపకాల నుంచి దూరంగా ఉండాలంటే ఇదే సరైన సమయని కంపెనీ ప్రకటించింది. ఈ కంపెనీకి అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాల్లో శాఖలు కూడా ఉన్నాయి.