PopCorn Bill : సినిమా చూట్టానికి వెళితే.. చుక్కలు కనిపించాయి.. వైరల్‌గా మారిన పాప్‌కార్న్ బిల్లు
ఈ రోజుల్లో ఇంటిల్లిపాది కలిసి సినిమాకు వెళ్లడం ఖర్చుతో ముడిపడిన వ్యవహారం. నలుగురున్న కుటుంబం సినిమాకెళితే ఈజీగా ఓ రెండు వేలు సమర్పించుకోవాల్సి వస్తోంది. ఇప్పటిక కొందరు థియేటర్లకు కుటుంబసభ్యులతో , ఫ్రెండ్స్‌తో కలిసి వెళుతున్నారనుకోండి. కరోనా తర్వాత ఇది కూడా చాలా తగ్గింది. ఓటీటీ ఫ్టాట్‌ఫామ్‌ల జోరు పెరిగింది. తమ అభిమాన నటుల సినిమాలు వచ్చినా చాలా మంది థియేటర్లకు వెళ్లడంలేదు. ఏడెనిమిది వారాలు తర్వాత ఎలాగూ ఓటీటీలో వచ్చేస్తుంది.
ఈ రోజుల్లో ఇంటిల్లిపాది కలిసి సినిమాకు వెళ్లడం ఖర్చుతో ముడిపడిన వ్యవహారం. నలుగురున్న కుటుంబం సినిమాకెళితే ఈజీగా ఓ రెండు వేలు సమర్పించుకోవాల్సి వస్తోంది. ఇప్పటిక కొందరు థియేటర్లకు కుటుంబసభ్యులతో , ఫ్రెండ్స్‌తో కలిసి వెళుతున్నారనుకోండి. కరోనా తర్వాత ఇది కూడా చాలా తగ్గింది. ఓటీటీ ఫ్టాట్‌ఫామ్‌ల జోరు పెరిగింది. తమ అభిమాన నటుల సినిమాలు వచ్చినా చాలా మంది థియేటర్లకు వెళ్లడంలేదు. ఏడెనిమిది వారాలు తర్వాత ఎలాగూ ఓటీటీలో వచ్చేస్తుంది.. అప్పుడు చూసుకోవచ్చని అనుకుంటున్నారు. దీనికంతటికి కారణం ఒకటే. థియేటర్‌లో సినిమా చూడటం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడం. ఓ సినిమా ప్రేమికుడు మొన్నో సినిమాకు వెళ్లాడు. ఇంటర్వెల్‌కు పాప్‌కార్న్ (popcorn) కొన్నాడు. ఆ తర్వా పాప్‌కార్న్ బిల్లు చూసేసరికి మూర్ఛ వచ్చినంత పనైంది మనోడికి. కాస్త తేరుకున్నాక చాల బాధపడ్డాడు. అటు పిమ్మట తనకు ఎదురైన చేదు అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. ట్విటర్ యూజర్ త్రిదీప్ కె మండల్ అనే వ్యక్తి నోయిడాలోని పీవీఆర్‌లో ఓ సినిమా చూశారు. అందుకు అతడికి ఎంత ఖర్చయ్యిందనుకున్నారు? అక్షరాల 820 రూపాయలు. దీంతో పాటు టికెట్ రేట్ వేరే! పాప్‌కార్న్‌కు 460 రూపాయలైతే, కూల్‌డ్రింక్‌కు 360 రూపాయలయ్యింది. చెబితే ఎవరూ నమ్మరని బిల్లును ట్విట్టర్‌లో షేర్ చేశాడు త్రిదీప్.. ఒక్క సినిమా కోసం తాను చేసిన ఖర్చుతో ఏడాది పాటు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో కావాల్సినన్ని సినిమాలు చూడొచ్చని క్యాప్షన్ పెట్టాడు. ఇదిగో ఇలా దోచుకుంటున్నారనే థియేటర్లవైపుకు జనం రావడం లేదని రాసుకొచ్చాడు. దీనిపై నెటిజన్లు తలో రకంగా స్పందిస్తున్నారు. సినిమా థియేటర్లలో ఇంత రేట్లు ఉంటే ఎలా వెళతామని ఒకరంటే, ఇంటికెళ్లి భోజనం చేయండి, పాప్‌కార్న్ డబ్బులను ఆదా చేసుకోండి అని మరొకరు వ్యాఖ్యానించారు. థియేటర్‌కు వెళ్లి సినిమా మాత్రమే చూడండి. తినడం కోసం మాత్రం వెళ్లొద్దంటూ ఇంకొకరు సలహా ఇచ్చారు.