రెండో ప్రపంచయుద్ధంలో (second world war)మునిగిపోయిన ఓడ 80 ఏళ్ళ తరువాత ఇటీవల బయటపడింది . రెండవ ప్రపంచ యుద్ధంసమయంలో , పసిఫిక్ మహాసముద్రంలోని(pacific sea) పాపువా న్యూ గినియా దీవుల్లో అనేకమంది యుద్ధ ఖైదీలుగా ఉన్నారు. 1942జూన్ 22న, జపనీస్ నౌక SS మాంటెవీడియో మారులో(SS Montevideo Maru.) వారిని హైనాన్ ద్వీపానికి తరలించే ప్రయత్నం జరిగింది. ఆలా ఖైదీలను తరలిస్తున్నపుడు జరిగిన దాడిలో ఓడ సముద్రంలో కనుమరుగైంది .

హైనాన్ ద్వీపం జపాన్ (japan)పాలనలో ఉంది.ఓడ 1000 మందికి పైగా యుద్ధ ఖైదీలు ఇంకా పౌరులతో ప్రయాణిస్తుంది . అయితే,ఆ సమయంలో ఓ అమెరికా జలాంతర్గామి శత్రువుగా భావించి పొరపాటున ఓడపై దాడి చేసింది. ఈ ఘటనలో 1,080 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 979 మంది ఆస్ట్రేలియా(Australia) పౌరులు ఉన్నారు . ఈ దాడిలో భారీగా దెబ్బతిన్న జపాన్ నౌక ఎస్ఎస్ మాంటెవీడియో మారు సముద్రంలో మునిగిపోయింది.

అలా మునిగిపోయిన ఈ నౌకను వెలికితీయాలన్న డిమాండ్ బలంగా ఉండటంతో ఆస్ట్రేలియన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్, ఆస్ట్రేలియన్ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్, సైలెంట్ వరల్డ్ ఫౌండేషన్ అలాగే నెదర్లాండ్స్ ఓషన్ సర్వే ఆర్గనైజేషన్ పుగ్రో సంయుక్త ఆపరేషన్‌ను చేపట్టాయి. అధునాతన పరికరాల సహాయంతో నిర్వహించిన ఈ సెర్చ్ మిషన్ ఎట్టకేలకు విజయవంతమైంది.

81 సంవత్సరాల తరువాత, SS మాంటెవీడియో మారు(SS Montevideo Maru.) నౌక ఎక్కడుందో కనుగొన్నారు . ఈ ఓడను దక్షిణ చైనా సముద్ర బేసిన్‌లో గుర్తించారు . ఈ విషయంపై స్పందిస్తూ ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మాట్లాడారు . దేశంకోసం పోరాడిన వారిని ఎన్నటికీ మరువబోము అన్న వైఖరికి ఈ అన్వేషణే నిదర్శనమని పేర్కొన్నారు . దేశానికి సేవ చేసిన వారు ఎప్పటికీ గుర్తుండిపోతారని అన్నారు.
కాగా, ఈ నౌక సముద్ర గర్భంలో 4 వేల మీటర్ల లోతులో ఉందని ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ తెలిపారు. ప్రస్తుతం ఫిలిప్పీన్స్‌లోని లుజోన్ ద్వీపం తీరంలో ఈ ఓడ ఉంది.

Updated On 22 April 2023 5:56 AM GMT
rj sanju

rj sanju

Next Story