హిస్సామ్‌ హుసేన్‌ దేహైనీనే(Hissam Hussain Dehaine) ఈ కథలో హీరో! అన్నట్టు ఈయన నగర మేయర్‌(Mayor) కూడా! ఈయనగారి ప్రేమించాలని ఎలా అనిపించిందో ఏమోకానీ ఓ 16 ఏళ్ల అమ్మాయి ప్రేమించాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. చేసుకున్న వెంటనే కొత్త అత్తగారికి స్థానిక ప్రభుత్వంలో సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శిగా ప్రమోషన్‌ ఇచ్చేశాడు.

చాలా మంది అంకుల్స్‌కు(uncles) కడుపుమంట తెప్పించే వార్తే ఇది! అందరికీ కాదు కానీ కొందరైతే మాత్రం ఈర్షాసూయలతో రగిలిపోవడం ఖాయం.. ఎందుకంటే.. 65 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి 16 ఏళ్ల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంటే మండదా మరి! ఈ గొప్ప ప్రణయగాధ దక్షిణ బ్రెజిల్‌లోని(Brazil) అరౌకారియా(Araucaria) నగరంలో జరిగింది.

హిస్సామ్‌ హుసేన్‌ దేహైనీనే(Hissam Hussain Dehaine) ఈ కథలో హీరో! అన్నట్టు ఈయన నగర మేయర్‌(Mayor) కూడా! ఈయనగారి ప్రేమించాలని ఎలా అనిపించిందో ఏమోకానీ ఓ 16 ఏళ్ల అమ్మాయి ప్రేమించాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. చేసుకున్న వెంటనే కొత్త అత్తగారికి స్థానిక ప్రభుత్వంలో సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శిగా ప్రమోషన్‌ ఇచ్చేశాడు.

పెళ్లయ్యాక ఈ వార్త బయటకు వచ్చింది. దుమారం రేపిన ఈ ఘటనపై విచారణ సంస్థలు రంగంలోకి దిగాయి. మేయర్‌పై పుంఖానుపుంఖాలుగా వచ్చిన అవినీతి, బంధుప్రీతి ఆరోపణలపై దర్యాప్తు మొదలుపెట్టాయి కూడా! బ్రెజిల్‌ చట్టాల ప్రకారం 16 ఏళ్లు దాటిన దాటిన అమ్మాయిలు తల్లిదండ్రుల అనుమతితో ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు.

అలా 16 ఏళ్లు వచ్చాయో లేదో ఆ మరునాడే మేయర్‌ను పెళ్లి చేసుకుంది. అమ్మాయి తల్లికి, అదేనండి హిస్సామ్‌ హుసేన్‌ దేహైనీ అత్తగారికి అంతకు ముందే విద్యాశాఖలో ఉద్యోగం ఉండేది. అత్తాగారికి తక్కువ జీతం రావడం మేయర్‌ తట్టుకోలేకపోయాడు. పైగా హోదా కూడా తక్కువే! మేయర్‌ అత్తగారంటే ఎలా ఉండాలి? సెక్రటరీ రేంజ్‌ ఉండాలిగా! అందేకే ఆమెకు పదోన్నతి ఇచ్చారు. ఈ మొత్తం బాగోతాన్ని డిప్యూటీ మేయర్‌ సీమా బయటపెట్టారు..

Updated On 1 May 2023 4:16 AM GMT
Ehatv

Ehatv

Next Story