ఆపిల్ 15 సిరీస్ కోసం ఎదురుచూస్తున్న తరుణం లో అదిరిపోయే ఫీచర్స్ గురించి updates వచ్చేసాయి అవేంటో చూసేద్దాం !
ప్రతి ఏడాది కొత్త సిరీస్ ఐఫోన్ల (iPhone)తో అందర్నీ దృష్టిని ఆకట్టుకుంటుంది . యాపిల్ (Apple) రూపొందించే డివైజ్‌లు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అవుతుంటాయి.రాబోయే ఆపిల్ సిరీస్ 15 మోడల్ ఎలా ఉండబోతుంది. ఎలాంటి ఫీచర్స్ ఉండబోతున్నాయి అనేదాన్నిపైన పెద్ద ఎత్తులో చర్చలు నడుస్తున్నాయి . ఆపిల్ 15 సిరీస్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో అదిరిపోయే ఫీచర్స్ గురించి updates వచ్చేసాయి అవేంటో చూసేద్దాం !
ఐఫోన్ 14 సిరీస్‌లోనే కంపెనీ ఎన్నో అడ్వాన్స్‌డ్ ఫీచర్లను పరిచయం చేసింది.ఈ ఏడాది ఐఫోన్ 15 (iPhone 15) సిరీస్ మోడల్స్ మార్కెట్లోకి రానున్నాయి. మరి ఈ ఫోన్ లో ఎలాంటి ఫీచర్లు రాబోతున్నాయి అనేది అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు . ఆపిల్ 15 మొబైల్ ఫీచర్స్ మార్కెట్ లో లీక్ అయ్యాయి . లీకైన సమాచారం ప్రకారం అసలు ఎలాంటి ఫీచర్స్ ఈ సిరీస్ లో ఉన్నాయంటేఈ సరి ఐఫోన్ 15 మోడల్ ల్లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో రావచ్చని అంచనా . ఇప్పటి వరకు వచ్చిన అన్ని మోడల్స్ ల్లో దాదాపు గా 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరాలు ఉంటున్నాయి. అయితే ఫ్రంట్ కెమెరాగా 12 మెగాపిక్సెల్ సెన్సార్‌ను కంపెనీ కొనసాగించవచ్చు అనే అంచనాలు ఉన్నాయి .
ధర విషయానికి వస్తే ఆపిల్ 14 ప్రో మాక్స్ ,ఆపిల్ 14 సిరీస్ ధరలు 80 వేల రూ .నుండి లక్ష యాభైవేల వరకు ఉంది. దీని బీటౌట్ చేస్తూ ఈ సరి ఆపిల్ 15 ధరలు 2 లక్షలకు పైమాటే గ ఉండబోవుచు అనే అంచనాలు వినబడుతున్నాయి . గత సిరీస్ ఫోన్ లో ఉన్న A15 చిప్ కంటే అడ్వాన్స్డ్ గా ఉండే విధంగా ఐఫోన్ 15లో A16 బయోనిక్ SoC ఉండవచ్చు. అయితే ప్రో మోడల్స్ లేటెస్ట్ A17 SoC చిప్‌తో బెస్ట్ పర్పార్మెన్స్ ఇవ్వనున్నాయి.
ఐఫోన్ 15 మోడల్స్ 6.2 అంగుళాల డిస్‌ప్లేతో వస్తాయి.యాపిల్ ప్రో మోషన్ డిస్‌ప్లే టెక్‌ను రెగ్యులర్ ఐఫోన్ 15కి ఎక్స్‌టెంట్ చేస్తుందా లేదా అనేదాని పైన ఇంకా క్లారిటీ లేదు . ప్రో మోషన్ అనేది 120Hz డిస్ప్లే. చాలా ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇది ఉంటుంది. ఇది స్మూత్ స్క్రోలింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. అలాగే మంచి గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. పూర్తి అడ్వాన్స్డ్ టెక్నాలజీ తో ఈ 15 సిరీస్ ని ఈ ఏడాదిలో లాంచ్ చేయటం జరుగుతుంది .