Women Commission Notice To Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు
జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్‌కు(Pawan kalyan) ఏపీ మహిళా కమిషన్(AP Women Commission) నోటీసులు(Notices) ఇచ్చింది. ఏపీలో మహిళలు కనిపించకుండా(Women Missing) పోతున్నారని ఏలూరు(Eluru) సభలో చేసిన వ్యాఖ్యలపై నోటీసులు జారీ చేసింది. పది రోజులలోగా ఈ కామెంట్స్‌పై వివరణ ఇవ్వాలని నోటీసులలో కోరింది.

ఏపీలో 18 వేల మంది అమ్మాయిలు మిస్ అవడానికి కారణం వాలంటీర్లు(Volunteer) అంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి గ్రామంలో ఎవరు ఎవరి మనిషి.. ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు.. ఆడపిల్లలు ఎవరినైనా ప్రేమిస్తున్నారా.. వారిలో వితంతువులు ఉన్నారా.. ఇలా వాలంటీర్లు సమాచారం సేకరించి సంఘవిద్రోహ శక్తులకు చేరవేయడంతో ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై కేంద్ర నిఘావర్గాలు తనను హెచ్చరించాయని.. ఇందులో వైఎస్సార్సీపీ పెద్దల హస్తం కూడా ఉందని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదిలావుంటే.. పవన్ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఒంటరి మహిళల్ని అవమానపరిచేలా మాట్లాడారని.. ఆయన వివరణ ఇచ్చే వరకు మహిళా కమిషన్ వెంటాడుతుందన్నారు. వాలంటీర్లకు పవన్ క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలన్నారు.