ఎప్పుడో కానీ ఏనుగులకు కోపం రాదు.. వచ్చిందో ఇక అంతే సంగతులు! మదమెక్కిన మత్తేభం ఎంత బీభత్సాన్ని సృష్టిస్తుందో మనకు తెలియంది కాదు. లేటెస్ట్‌గా సోషల్‌ మీడియాలో ఓ ఏనుగు చేసిన విధ్వంసానికి సంబంధించిన వీడియో సర్క్యూలేట్‌ అవుతోంది. అసోంలోని గౌహతిలో రోడ్డు మీద ఎప్పట్లాగే వాహనాలు వెళుతున్నాయి. అంతలోనే ఓ పెద్ద ఏనుగు రోడ్డు మీదకు వచ్చేసింది.. ఏనుగును చూసిన వాహనదారులు అలెర్టయ్యారు. ఎందుకైనా మంచిదని తమ బళ్లు నిలిపివేసి, అది రోడ్డు దాటి వెళ్లిపోయేంత […]

ఎప్పుడో కానీ ఏనుగులకు కోపం రాదు.. వచ్చిందో ఇక అంతే సంగతులు! మదమెక్కిన మత్తేభం ఎంత బీభత్సాన్ని సృష్టిస్తుందో మనకు తెలియంది కాదు. లేటెస్ట్‌గా సోషల్‌ మీడియాలో ఓ ఏనుగు చేసిన విధ్వంసానికి సంబంధించిన వీడియో సర్క్యూలేట్‌ అవుతోంది. అసోంలోని గౌహతిలో రోడ్డు మీద ఎప్పట్లాగే వాహనాలు వెళుతున్నాయి. అంతలోనే ఓ పెద్ద ఏనుగు రోడ్డు మీదకు వచ్చేసింది.. ఏనుగును చూసిన వాహనదారులు అలెర్టయ్యారు. ఎందుకైనా మంచిదని తమ బళ్లు నిలిపివేసి, అది రోడ్డు దాటి వెళ్లిపోయేంత వరకు ఎదురుచూస్తున్నారు. కానీ ఓ చిన్న ట్రాలీ మాత్రం ఏనుగుకు దగ్గరగా వచ్చేసింది.. ట్రాలీని చూసిన ఏనుగుకు తిక్కలేసింది. అప్పటికీ డ్రైవర్‌ ట్రాలీని వెనక్కి తీసుకెళ్లాడు. అయినా ఆ గజరాజుకు మాత్రం కోపం తగ్గలేదు. తాను రోడ్డు దాటుతుంటే అందరూ ఎక్కడికక్కడ ఆగిపోతే నువ్వేంట్రా భయం భక్తి లేకుండా ముందుకొచ్చేశావు అని మనసులో అనుకుని ట్రాలీని ఎత్తి అవతల పడేసిందా ఏనుగు. అయినా కోపం చల్లారలేదు. ట్రాలీని దొర్లించి పడేసి తన దారిలో తాను వెళ్లిపోయింది.. బతుకు జీవుడా అని అనుకుంటూ ట్రాలీ డ్రైవర్‌ ఊపిరి పీల్చుకున్నాడు. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే కొన్ని వేల మంది చూశారు. అడవులు అంతరించిపోతే.. ఇలాంటి ఘటనలే జరుగుతాయంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Updated On 7 Feb 2023 8:31 AM GMT
Ehatv

Ehatv

Next Story