✕
Anausya On Aunty Comments : ఆంటీ అంటే అనసూయకు కోపం రావడం లేదట!
By EhatvPublished on 3 April 2023 1:28 AM GMT
సోషల్ మీడియా(Social Media)లో యాంకర్ అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj)చాలా యాక్టివ్‌గా ఉంటారు. బుల్లితెరపై స్టార్ యాంకర్ అయిన అనసూయ అవకాశం వచ్చినప్పుడల్లా సినిమాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలను , యాక్టివిటీని షేర్ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తున్నారు. అదే సమయంలోట్రోలింగ్ను కూడా ఎదుర్కొంటున్నారు. ఇలాంటి బట్టలు నీకు అవసరమా అంటీ(Aunty)?

x
Anausya On Aunty Comments
-
- సోషల్ మీడియా(Social Media)లో యాంకర్ అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj)చాలా యాక్టివ్‌గా ఉంటారు. బుల్లితెరపై స్టార్ యాంకర్ అయిన అనసూయ అవకాశం వచ్చినప్పుడల్లా సినిమాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలను , యాక్టివిటీని షేర్ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తున్నారు. అదే సమయంలోట్రోలింగ్ను కూడా ఎదుర్కొంటున్నారు. ఇలాంటి బట్టలు నీకు అవసరమా అంటీ(Aunty)? నువ్వు ఎంతగా ప్రయత్నించినా నువ్వు అమ్మాయివి కావు, ఆంటీవే .. ఇలాంటి కామెంట్స్ కూడా కొందరు చేస్తుంటారు.
-
- అంటీ అని పిల్చినందుకు అప్పట్లో ఆ నెటిజన్‌కు పెద్ద క్లాస్ తీసుకున్నారు అనసూయ. లైగర్ మూవీ(Liger Movie) ఫెయిల్యూర్ని ఎంజాయ్ చేస్తూ అనసూయ ఓ సెటైరికల్ ట్వీట్ చేసినప్పుడు ఆమెపై ఈ రకమైన ట్రోలింగ్ ఎక్కువయ్యింది. ఆంటీ అనే ట్యాగ్ ట్రెండ్ చేశారు. అంటీ అని పిలవడం కూడా వేధింపుల కిందకే వస్తుందని, కేసు పెడతానని హెచ్చరించారు అనసూయ.
-
- అయినా కొందరు లైట్ తీసుకున్నారు. దాదాపు మూడు రోజుల పాటు ఇలా అనసూయ(Anasuya), విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ జరిగింది. ఆంటీ అంటూ అనసూయను ఓ రేంజ్లో ఆడేసుకున్నవారిపై , అలా ట్రోల్స్ చేసిన వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా అరెస్ట్ వరకు తీసుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పుడీ ఆంటీ సంగతి ఎందుకొచ్చిందన్న డౌట్ మీకు వచ్చే ఉంటుంది..
-
- లేటెస్ట్గా అనసూయ ఇన్స్టాగ్రామ్(Instagram)లో నెటిజన్లతో కాసేపు ముచ్చటించారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇందులో భాగంగా 'అక్కా.. మిమ్మల్ని ఎవరైనా ఆంటీ అంటే మీకు ఎందుకు అంత కోపం వస్తుంది' అని ఓ నెటిజన్ అడిగారు. దీనికి అనసూయ చాలా పొలైట్‌గా ఆన్సరిచ్చారు.
-
- 'ఆంటీ అని అనేవారిలో అర్థాలు వేరే ఉంటాయి కాబట్టే నాకు కోపం వస్తుంది. అయినా ఇప్పుడు నాకు కోపం రావడం లేదు. అది వాళ్ల కర్మకే వదిలేస్తున్నాను. అలాంటివారిని కరెక్ట్ చేసేంత సమయం, ఓపిక నాకు లేవు. నాకు అంతకంటే ముఖ్యమైన పనులు చాలానే ఉన్నాయి' అంటూ జవాబిచ్చారు. త్వరలోనే మరో క్రేజీ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేస్తానని చెప్పి క్యూరియాసిటీని పెంచారు అనసూయ. అనసూయ ఇచ్చిన ఆన్సర్ కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది.

Ehatv
Next Story