ప్రముఖ యాంకర్‌, నటి అనుసూయ భరద్వాజ్‌(Anasuya bharadwaj) మనసు షారూక్‌ ఖాన్‌పైకి(shah rukh khan) మళ్లింది. ఐ లవ్‌ యూ (I Love You)అంటూ సందేశం పంపింది. ఈ మెసేజ్‌లో గూడార్థాలు వెతక్కండి.. అసలు షారుక్‌ను అనుసూయ ఎందుకు ప్రేమించాల్సి వచ్చిందంటే.. ఓ ఇంటర్వ్యూలలో(Interview) షారుక్‌ చేసిన కామెంట్లు చూసి.. ' మహిళల గౌరవ ప్రతిష్టలకు భంగం కలించినట్టుగా ఉన్న సినిమాలను నేను చస్తే చేయను' అని షారుక్‌ అనడం అనుసూయకు తెగ నచ్చేసింది. ఒక్క అనుసూయకేమిటీ అందరికీ షారుక్‌ కామెంట్‌ నచ్చి తీరుతుంది. షారుక్‌ అన్నమాటకు అనుసూయ ఫిదా అయిపోయి వెంటనే ఐ లవ్‌ యూ అని రాసుకొచ్చారు.

ప్రముఖ యాంకర్‌, నటి అనుసూయ భరద్వాజ్‌(Anasuya bharadwaj) మనసు షారూక్‌ ఖాన్‌పైకి(shahrukh khan) మళ్లింది. ఐ లవ్‌ యూ (I Love You)అంటూ సందేశం పంపింది. ఈ మెసేజ్‌లో గూడార్థాలు వెతక్కండి.. అసలు షారుక్‌ను అనుసూయ ఎందుకు ప్రేమించాల్సి వచ్చిందంటే.. ఓ ఇంటర్వ్యూలలో(Interview) షారుక్‌ చేసిన కామెంట్లు చూసి.. ' మహిళల గౌరవ ప్రతిష్టలకు భంగం కలించినట్టుగా ఉన్న సినిమాలను నేను చస్తే చేయను' అని షారుక్‌ అనడం అనుసూయకు తెగ నచ్చేసింది. ఒక్క అనుసూయకేమిటీ అందరికీ షారుక్‌ కామెంట్‌ నచ్చి తీరుతుంది. షారుక్‌ అన్నమాటకు అనుసూయ ఫిదా అయిపోయి వెంటనే ఐ లవ్‌ యూ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో(Social media) అనసూయ చేసిన కామెంట్‌ వైరల్‌ అవుతోంది. ఇదిలాఉంటే యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌కు ఉన్న క్రేజ్‌(Craze) మామూలుది కాదు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఆమెకు విపరీతమైన ఫ్యాన్స్‌ ఉన్నారు. సోషల్ మీడియాలో ఆమెకు ఫాలోవర్స్‌ కూడా ఎక్కువే! అల్లు అర్జున్‌(Allu Arjun) హీరోగా వస్తున్న పుష్ప -2లో కీలక పాత్ర పోషిస్తున్న అనుసూయ కాసింత సమయం దొరికితే చాలు సోషల్‌ మీడియాలోకి వచ్చేస్తారు. తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా చెబుతారు. ఇంటర్వ్యూలకు కూడా అటెంట్‌ అవుతుంటారు. వాటిల్లో పలు ఆసక్తకరమైన విషయాలను వ్యూవర్స్‌తో(Viewers) పంచుకుంటారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను వైన్‌ (Wine)తాగుతానని ఓపెన్‌ అయిన అనుసూయ అందులో తప్పేమీ లేదని సమర్థించుకున్నారు. ఇక లేటెస్ట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్లు అందరిని ఉలిక్కిపడేలా చేశాయ. ఇంతకీ అనసూయ ఏమన్నారంటే ' మా అత్తగారికి బీహార్‌(Bihar). అక్కడ ఆచారాలు, సంప్రదాయాలు చాలా ఎక్కువ. బయటకు వెళ్లినప్పుడు తలపై కొంగు కప్పుకోవాలి. ఇంట్లో బంధుమిత్రులు వచ్చినా ఇలాగే ఉండాలి. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా అమ్మాయిలంటే ఇంకా ఎక్కువ ఇష్టం. నాకు ఆడపిల్లను(Girl child) కనాలని ఉందని నా అత్తగారికి సిగ్గు విడిచి చెప్పాను. ఆ మాట చెప్పగానే మా అత్తగారు(Mother- in- law) అంతెత్తున లేచారు. నాపై కొప్పడ్డారు. బీహార్‌లో కట్టుబాట్లు అలా ఉంటాయి మరి! అక్కడ పురుషాధిక్యత ఎక్కువ. నా పిల్లలకు కూడా చెల్లిన ఇస్తానని చెబితే చిన్న కొడుకు ఆగ్రహం వ్యక్తం చేశాడు' అని అనసూయ చెప్పుకొచ్చారు. తర్వాత యాంకర్‌ (Anchor)కొనసాగింపుగా అమ్మాయిని కంటారా అని అడిగారు. దానికి అనుసూయ 'నాకు కనాలనే ఉంది. కానీ నా భర్త(Husband) సహకరించడం లేదు. ఆడపిల్ల ఉన్న ఇల్లు ప్రశాంతంగా, అణకువగా ఉంటుంది' అంటూ చెప్పుకొచ్చారు. అనసూయ కామెంట్లు చూసిన ప్రేక్షకులు పలు రకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

Updated On 13 Dec 2023 4:38 AM GMT
Ehatv

Ehatv

Next Story