నాటు నాటు(naatu naatu)పాట ప్రంపంచ వ్యాప్తంగా ఎంత ఫేమస్ అయ్యిందో అందరికి తెలిసిందే. రిలీజ్ అయినప్పటి నుంచీ.. ఇప్పటి వరకూ ఎన్నో రికార్డ్ లు క్రియేట్ చేసిన ఈ పాట తాజాగా.. మరో సారి వైరల్ అవుతోంది.
ఆస్కార్(oscar) సాధించడంతో.. ట్రిపుల్ ఆర్(RRR) తో పాటు నాటు నాటు (naatu naatu)పాట సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సినిమా రిలీజ్ అయ్యి ఏడాది అయినా... ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు పాటకు.

నాటు నాటు(naatu naatu)పాట ప్రంపంచ వ్యాప్తంగా ఎంత ఫేమస్ అయ్యిందో అందరికి తెలిసిందే. రిలీజ్ అయినప్పటి నుంచీ.. ఇప్పటి వరకూ ఎన్నో రికార్డ్ లు క్రియేట్ చేసిన ఈ పాట తాజాగా.. మరో సారి వైరల్ అవుతోంది.

ఆస్కార్(oscar) సాధించడంతో.. ట్రిపుల్ ఆర్(RRR) తో పాటు నాటు నాటు (naatu naatu)పాట సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సినిమా రిలీజ్ అయ్యి ఏడాది అయినా... ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు పాటకు. అందేకే ఆస్కార్ తో పాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ తో పాటు మరెన్నో అంతర్జాతీయ అవార్డ్ లను సాధించింది సాంగ్. ఈ పాటకు ప్రపంచం అంతా కాలు కదిపింది. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ..అందరూ ఈ పాటకు డాన్స్ చేసినవారే. సెలబ్రిటీలు ఈ పాటకు డాన్స్ చేసిన వీడియోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. చాలా దేశాల్లో చాలా మంది నాటు నాటు అంటూ అదరగొట్టారు. ఇక తాజాగా ఈ పాటతో ఏకంగా తోలు బోమ్మలతో డాన్స్ చేయించారు.

నాటు నాటు (naatu naatu)పాటకు కాలు కదిపిన సెలబ్రిటీలతో భారత ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా(Anand mahindra) కూడా ఉన్నారు. రామ్ చరణ్ తో కలసి ఈ పాటకు స్టెప్స్ వేశారు మహేంద్ర. అంతే కాదు ఈ పాటకు కాని ఈ సినిమాకు సంబంధించిన చిత్రమైన విషయాలు ఎన్నో గతంలో పంచుకున్న మహేంద్ర.. రీసెంట్ గా మరో సారి నాటు నాటు పాటకు సబంధించిన ఓ వీడియోను శేర్ చేసుకున్నారు. ఈ వీడియోలు ఈ పాటకు ఓ తోలుబోమ్మతో డాన్స్ చేయించడం చిత్రంగా అనిపించింది.

నాటు నాటు(naatu naatu) పాటకు ఇప్పటి వరకూ సామాన్యులు..సెలబ్రెటీలు మాత్రమే డాన్స్ చేశారు. కాని ఈసారి ఈ పాటకు ఓ తోలు బోమ్మ అదరిపోయే స్టెప్పులు వేసింది. ఇలా డాన్స్ చేయించడానికి అక్కడి నిర్వాహకులు.. బాగా కఫ్టపడ్డారట కూడా. అది అంత సులభమైన విషయం కాకపోయినప్పటికీ.. ఓ మహిళ దాన్ని చేసి చూపించింది. ఓ తోలుబొమ్మతో ఓ మహిళ చేయించిన నాటు నాటు డ్యాన్స్ వీడియోని ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

అంతే కాదు ఈ వీడియో పోస్ట్ చేయడంతో పాటే.. ఓ నోట్ చూడా రాశారు మహేంద్ర(Anand mahindra). ఒకే ఒక లాస్ట్ ట్వీట్. నాటు నాటు(naatu naatu) పై నేను ఒక హామీ ఇస్తున్నాను. ప్రపంచవ్యాప్తం అనే దానికి ఇదే నిదర్శనం.ఎందుకంటే ఇప్పుడు ఇది ప్రపంచం మొత్తాన్ని తన తీగలపై కలిగి ఉంది అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దానికి రకరకాల కామెంట్లు వస్తున్నాయి. నాటు నాటు పాట మ్యానియా ఇప్పట్లో వదిలివెళ్ళదని అంటున్నారు ఫ్యాన్స్.

Updated On 24 March 2023 5:50 AM GMT
Ehatv

Ehatv

Next Story