Amravati Auto Driver : అమరావతిలో ఆటో డ్రైవర్ మాట్లాడిన ఇంగ్లీష్ చూస్తే... షాక్ అవ్వాల్సిందే!
ఓ ఆటో డ్రైవర్ ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఓ ఆటో డ్రైవర్ ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆటో నడుపుతున్న ఓ వ్యక్తి ఇంగ్లీష్ మాట్లాడిన తీరు ఎందరో నెటిజెన్లను ఎంతో ఆకట్టుకుంది. ఇంగ్లీష్ మాట్లాడుతున్న ఆ వ్యక్తి, లండన్, అమెరికా, పారిస్ వంటి ప్రదేశాలు చూసి రావలంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలని ప్రోత్సాహిస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నెటిజెన్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వీడియో పోస్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
మహారాష్ట్రలోని అమరావతిలో ఓ ఆటో డ్రైవర్ ఇంగ్లీష్ మాట్లాడిన తీరు ఎందరో నెటిజెన్లను ఆకట్టుకుంది. ఇంగ్లీష్ ఎంతో వేగంగా, స్పష్టంగా మాట్లాడుతున్న తీరుకు నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఆ వీడియోకు “ఈ రోజు, నేను చాలా ఆశ్చర్యపరిచే పెద్దమనిషిని కలిశాను. ఆటో డ్రైవర్,మాతో చాలా సరదాగా మాట్లాడాడు, కానీ నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, అతను ఇంగ్లీషులో చాలా అనర్గళంగా మాట్లాడుతున్నాడు మరియు ఇంగ్లీషు నేర్చుకోవటానికి ప్రజలను ప్రోత్సాహించే అతను చేస్తున్న ప్రయత్నం ఎంతో ఆశ్చర్యకరం" అని టెక్స్ట్ జతచేశారు.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో వ్యక్తి ఇలా మాట్లాడాడు. “నేను చెప్పేది చాలా శ్రద్ధగా వినండి, మీకు ఇంగ్లీషు భాష తెలిస్తే లండన్, పారిస్, అమెరికా వంటి దేశాలు వెళ్ళొచ్చు.. మీకు ఇంగ్లీషు రాకపోతే అక్కడికి వెళ్లలేరు’’ అని ఆటో డ్రైవర్ అన్నాడు.
