అమెరికాకు(America) చెందిన 38 ఏళ్ల ఎరిన్‌ హనీకట్‌కు(Erin Honeycutt) 11.8 అంగుళాల పొడవైన గడ్డం(Beard) ఉంది.. అంత పొడవైన గడ్డాన్ని చూసి హాశ్చర్యపోయిన గిన్నిస్‌(Guinness Record) వారు వెంటనే అది వరల్డ్‌ రికార్డు(World Record) అని చెప్పేసి సర్టిఫికెట్‌ కూడా ఇచ్చారు. ఈ మాత్రం దానికే వరల్డ్‌ రికార్డు ఇచ్చేస్తారా? అని కొశ్చనేయకండి..

అమెరికాకు(America) చెందిన 38 ఏళ్ల ఎరిన్‌ హనీకట్‌కు(Erin Honeycutt) 11.8 అంగుళాల పొడవైన గడ్డం(Beard) ఉంది.. అంత పొడవైన గడ్డాన్ని చూసి హాశ్చర్యపోయిన గిన్నిస్‌(Guinness Record) వారు వెంటనే అది వరల్డ్‌ రికార్డు(World Record) అని చెప్పేసి సర్టిఫికెట్‌ కూడా ఇచ్చారు. ఈ మాత్రం దానికే వరల్డ్‌ రికార్డు ఇచ్చేస్తారా? అని కొశ్చనేయకండి.. ఇవ్వడం సబబు. ఎందుకంటే ఎరిన్‌ హనీకట్‌ మగాయన కాదు.. ఆమె మహిళ! ఇంతకు ముందు ఈ రికార్డు అదే దేశానికి చెందిన వివాన్‌ వీలర్‌(Vivan Wheeler) అనే మహిళ పేరిట ఉండిందట! ఆమెకు 10.04 అంగుళాల గడ్డం ఉండేదట! ఇప్పుడు హనీకట్‌ బారేడు గడ్డాన్ని పెంచేసి ఆ రికార్డును బద్దలు కొట్టారు. మిషిగాన్‌కు చెందిన హనీకట్‌కు చిన్నప్పటి నుంచే జన్యుపరమైన(Genetic) సమస్యలు ఉండేవి. 13 ఏళ్లు వచ్చేసరికి ఆమెకు గడ్డం మొలవడం మొదలయ్యింది. మొదట్లో పాపం బాగా ఆందోళన పడేది. రోజుకు మూడునాలుగు సార్లు షేవింగ్‌ చేసుకునేది. అవాంచిత రోమాలను తొలగించే రకరకాల లేపనాలను ఎన్నింటినో వాడింది. అయినా కించిత్‌ ప్రయోజనం లేకుండా పోయింది. కొన్నాళ్ల తర్వాత విపరీమైన రక్తపోటుతో కంటి స్ట్రోక్‌ వచ్చింది. పాక్షికంగా కంటిచూపు పోయింది.

అక్కడ్నుంచి ఆమె షేవ్‌ చేయడం మానేసింది. హెయిర్‌ రిమూవల్స్‌ వాడటం బంద్‌ చేసింది. దీంతో గడ్డం క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఆమెలో ఓ రకమైన సైకలాజికల్‌ ఫైట్‌ మొదలయ్యింది. ఇంటికే పరిమితమయ్యింది. బయటకు వెళితే నలుగురు నాలుగు రకాల మాటలంటారేమోనన్న భయంతో నరకం అనుభవించింది. ఆమె పరిస్థితిని గమనించిన స్నేహితులు, సన్నిహితులు గడ్డం ఉంటే తప్పేమిటి? ఇలా కూడా అందంగా ఉన్నావంటూ ప్రోత్సహించారు. వారి ప్రోత్సాహంతో హనీకట్‌ ఆందోళన వీడింది. గడ్డం పెంచడంపై దృష్టి పెట్టింది. ఆ విధంగా ప్రపంచ రికార్డు సాధించింది. జన్యుసమస్యలతో పాటుగా ఇంకా ఆమెను అనారోగ్య సమస్యలు పట్టిపీడించాయి. బ్యాక్టీరియా సోకడంతో ఆమె కాలును తీయాల్సి వచ్చింది. అప్పుడు కూడా ఆమె చాలా బాధపడింది. ఆవేదన చెందింది. కొన్నాళ్లకే అందులోంచి బయటకు వచ్చింది. సామాజికంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగింది. ఫిబ్రవరి 8వ తేదీననే ఆమె పొడవైన గడ్డం కలిగిన మహిళగా గిన్నిస్‌ రికార్డు నెలకొల్పినట్టు అధికారులు చెప్పినప్పటికీ , రెండు రోజుల కిందటే అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయాన్ని ప్రకటించారు. తనకు లభించిన ఈ రికార్డు వైద్యం చేయించుకోవడానికి ఏదో ఒక రూపంలో సహాయపడుతుందని హనీకట్‌ అన్నారు. తన శ్రేయోభిలాషులకు, కుటుంబ సభ్యులకు ఈ రికార్డును అంకితమిస్తున్నానని చెప్పారు.

Updated On 12 Aug 2023 7:10 AM GMT
Ehatv

Ehatv

Next Story