తమిళనాడులోని(TamilNadu) తిరువారూరు(Tiruvarur) జిల్లా అమ్మైయప్పన్‌లో షేక్‌దావూద్‌- జైలానీ బీవీ దంపతులు ఉండేవారు. వీరికి అమరుద్దీన్‌ అనే కొడుకు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. షేక్‌ దావూద్‌ 20 ఏళ్ల కిందటే కన్నుమూశారు. జైలానీ బీవీ 2020లో మరణించారు. అమరుద్దీన్‌ కష్టపడి ఇండస్ట్రీయలిస్టు అయ్యాడు.

తమిళనాడులోని(TamilNadu) తిరువారూరు(Tiruvarur) జిల్లా అమ్మైయప్పన్‌లో షేక్‌దావూద్‌- జైలానీ బీవీ దంపతులు ఉండేవారు. వీరికి అమరుద్దీన్‌(Ameeruddin ) అనే కొడుకు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. షేక్‌ దావూద్‌ 20 ఏళ్ల కిందటే కన్నుమూశారు. జైలానీ బీవీ 2020లో మరణించారు. అమరుద్దీన్‌ కష్టపడి ఇండస్ట్రీయలిస్టు అయ్యాడు. చెన్నైలో(chennai) ఉంటున్నాడు. కన్నవారిని గ్రామ ప్రజలు గుర్తించుకోవాలనే ఉద్దేశంతో వారి పేరిట గ్రామంలోని పేదలకు సాయం చేసేవారు అమరుద్దీన్‌. తన సొంతూరు దగ్గరలోనే కాట్టూరు గ్రామం ఉంది. అక్కడ దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి తన తల్లికి కట్టిన స్మారక మందిరం(Memorial Hall) ఉంది. అది చూసినప్పుడల్లా తన తల్లికి కూడా ఓ స్మారక మందిరాన్ని కడితే బాగుండనే భానవ అమరుద్దీన్‌లో కలిగేది. ఆలోచన వచ్చిన వెంటనే సొంత గ్రామంలో ఎకరం భూమి కొన్నాడు. రాజస్థాన్‌(Rajasthan) నుంచి నాణ్యమైన పాలరాయిని(Marble) తెప్పించారు. చూడటానికి అచ్చంగా తాజ్‌మహ్‌లా కనిపించేలా తల్లి కోసం ఓ స్మారక మందిరాన్ని నిర్మించారు. ఈ భవంతిని చూసేందుకు స్థానికులే కాదు, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కూడా తరలివస్తున్నారు.

Updated On 10 Jun 2023 1:18 AM GMT
Ehatv

Ehatv

Next Story