Allu Arjun : భారీ ఆఫర్ కు నో అన్న అల్లు అర్జున్.. ఆ పని అస్సలు చేయనన్న ఐకాన్ స్టార్
సినిమా(Cinema) పరిశ్రమలో తారలు రకరకాలుగా సంపాదించుకుంటున్నారు. సినిమాలో నటించడం మాత్రమే కాకుండా.. బ్రాండ్స్ ప్రమోట్ చేస్తూ.. సొంత బిజినెస్ లు(Business) పెడుతూ.. ఓపెనింగ్స్ కు వెళ్తూ.. హోస్టింగ్స్ (Hosting's)చేస్తూ.. ఇలా రకరకాలుగా కోట్లు గడిస్తున్నారు. కాని అందులో కాస్త విలువలు పాటించే వారు కూడా ఉన్నారు అందులో అర్జున్ పేరు ప్రముఖంగా చెప్పుకోవాలి. ఆయన మరోసారి తన విలువలు చాటుకుని.. ఆడియన్స్ ను ఇప్రెస్ చేశాడు. ఇంతకీ విషయం ఏంటంటే.. ?

ప్రస్తుతం పుష్ప(Pushpa) సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ సాధించిన అల్లు అర్జున్ కు..(Allu Arjun) జాతీయ స్థాయిలో మార్కెట్ ఏర్పడటంతో పాటు.. ఆయన డిమాండ్ కూడా పెరిగింది. ఎంతో మంది పెద్ద పెద్ద కంపెనీల ప్రతినిథులు.. ఎన్నో ఫేమస్ బ్రాండ్స్ ను(Brands) ప్రమోట్ చేయమని ఆయన ఇంటికి క్యూ కట్టారు. ఇక సెలెక్ట్ గా బన్నీ ఆ అడ్వటైజ్ మెంట్స్ చేస్తున్నాడు. ఫుడ్ యప్స్ కు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు.
అయితే ఈ బ్రాండ్ ప్రమోషన్(Promotion) విషయంలో బన్నీ కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. సమాజానికి హాని కలిగించే వాటిని ప్రమోట్ చేయవద్దు అని ఫిక్స్ అయ్యాడు. అందుకే వాటి విషయంలో జాగ్రత్తగా ఉంటున్నాడు. ఇక తాజాగా ఈయనకు భారీ ఆఫర్ వచ్చిందట ఏకంగా 10 కోట్లకు పైగా రెమ్యూనరేషన్(Remuneration) ఇస్తామని ఆఫర్ ఇచ్చినప్పటికీ అల్లు అర్జున్ మాత్రం ఆ ఆఫర్ ను తిరస్కరించాడట.
. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో మందు(Liquor) తాగే సన్నివేశాలలోనూ అలాగే గుట్కా(Pan Masala) తీసుకునే సమయంలోను కొన్ని కంపెనీలు తమ బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ఈ సినిమాలో నటించాలని ఆయనకు ప్రపోజల్ తీసుకువచ్చారట.ఈ సినిమా సన్నివేశాలలో భాగంగా మందు తాగేటప్పుడు ఆ లిక్కర్ కంపెనీకి సంబంధించినటువంటి లోగోని(Logo) చూపించడం ఆ కంపెనీలను ప్రమోట్ చేయాలని చెప్పారట.
అంతే కాదు ఈ విధంగా సినిమాలో తమ బ్రాండ్ ను ప్రమోట్ చేయడం కోసం అల్లు అర్జున్ కు ఏకంగా 10 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తామని కంపెనీ ఆఫర్(Offer) చేసిందట. కాని ఈ విషయంలో అల్లు అర్జున్ ఒక్క మాటమీదనే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రజల ఆరోగ్యానికి(Public Health) హానికరం చేసే వాటిని తాను ఎప్పుడు ప్రమోట్ చేయనని అల్లు అర్జున్ ఖరా ఖండీగా చెప్పేశారట. అంతే కాదు తనకు వచ్చిన ఈ గోల్డెన్ ఆఫర్ ను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. బన్నీచేసిన మంచి పని తెలిసి ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు.