Allu Arjun Gift To Ram Charan Daughter : రామ్ చరణ్ గారాల కూతురికి బన్నీ మామ సర్ ప్రైజింగ్ గిఫ్ట్స్.. ఏం పంపాడంటే..?
ఈమధ్యే తల్లీ తండ్రులుగా మారారు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) అండ్ ఉపాసన (Upasana).పెళ్ళైన 11 ఏళ్ళ తరువాత వారు పండంటి ఆడబిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు. జూన్ 20న జన్మించిన ఆ పాపకి లలితా సహస్రనామం నుంచి తీసుకున్న బీజాక్షరం..

Allu Arjun Gift
రీసెంట్ గా తల్లి తండ్రులు అయ్యారు రామ్ చరణ్, ఉపాసన, వీరిద్దరి కోసం సెలబ్రిటీ స్టార్స్ ఎంతో మంది ఎన్నో విలువైన బహుమతలుగు పంపించారు.ఇక తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తన కోడలికోసం సర్ ప్రైజింగ్ గిప్ట్స్ పపించాడట.
ఈమధ్యే తల్లీ తండ్రులుగా మారారు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) అండ్ ఉపాసన (Upasana).పెళ్ళైన 11 ఏళ్ళ తరువాత వారు పండంటి ఆడబిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు. జూన్ 20న జన్మించిన ఆ పాపకి లలితా సహస్రనామం నుంచి తీసుకున్న బీజాక్షరం.. క్లీంకార (Klin Kaara) అని పేరుని కూడా పెట్టారు. ఇక ఈ మెగా ప్రిన్సెస్ కి స్టార్ సెలబ్రిటీల నుంచి ఎన్నో విలువైన బహుమతులు వచ్చాయి.
ఆమధ్య యంగ్ టైగర్ ఎన్టీఆర్()NTR) కూడా వీరికోసం ప్రత్యేకంగా బహుమతులు పంపించారు. ఎన్టీఆర్ స్పెషల్ గా డిజైన్ చేసిన బంగారు డాలర్స్‌ను వారికోసం పంపించినట్లు వార్తలు వచ్చాయి. ఆ డాలర్స్ మీద చరణ్ తో పాటు.. ఉపాసన క్లింకార పేర్లు వచ్చేలాడిజైచేయించారట. తారక్. ఈ వార్త వైరల్ అయ్యింది. అటు ఆలియా భట్(Alia bhatt) కూడా వీరికి బహుమతులు పంపించింది.
తాజాగా క్లింకారకు మామయ్య.. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కూడా బహుమతి పంపించినట్లు వినిపిస్తుంది. క్లీంకార కోసం బన్నీ బంగారు పలక(Gloden slate) పంపించాడట. బంగారు పలక అంటే చిన్న పిల్లలు రాసుకునేది అనుకున్నారేమో, అది కాదు. క్లీంకార పుట్టిన తేదీ, సమయం, అలాగే తనకి ఆ పేరుని ఎలా పెట్టారు అనే వివరాలను.. ఆ బంగారు పలక పై అల్లు అర్జున్ డిజైన్ చేయించాడట. ఇక ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి దీనిలో ఎంత నిజం ఉందో తెలియదు గాని, బన్నీ ఐడియాకి మాత్రం అభిమానులు ఫిదా అవుతున్నారు.
