4 Four Nanis: నానీలంతా జగన్‌కు అండ.. జగన్ శిబిరంలో మరో నాని..!
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), పవన్ కల్యాణ్ (Pavan Kalyan) అంటే ఒంటికాలుతో లేచి విరుచుకుపడే నానీలు వైసీపీలో ఇప్పటికే ముగ్గురున్నారు. ఆ జాబితాలో మరో నాని చేరారు.
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), పవన్ కల్యాణ్ (Pavan Kalyan) అంటే ఒంటికాలుతో లేచి విరుచుకుపడే నానీలు వైసీపీలో ఇప్పటికే ముగ్గురున్నారు. ఆ జాబితాలో మరో నాని చేరారు. అందులో మొదటి వరుసలో కొడాలి నాని (Kodali Nani) ఉంటాడు. చంద్రబాబు, లోకేష్, పవన్‌ను టార్గెట్ చేయడంలో కొడాలి నానికి ఫస్ట్ ఉంటాడు. జగన్‌పై ఈగ వాలకుండా చూసుకోవడంలో కొడాలి నాని ముఖ్యుడు. వైసీపీ అధినేత జగన్‌ను విమర్శిస్తే కొడాలి నాని రెచ్చిపోతాడు. జగన్‌కు గత పదేళ్లుగా కొడాలి నాని అండగా ఉంటూ వస్తున్నాడు. సీఎం జగన్ తొలి కేబినెట్‌లో మంత్రిగా కొనసాగిన కొడాలి నాని.. మంత్రిగా దిగిపోయిన తర్వాత కూడా తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తుంటాడు. కమ్మ సామాజికవర్గానికి చెందిన కొడాలి నాని.. టీడీపీలో ఉన్న కమ్మ నేతలు జగన్‌ను టార్గెట్ చేసి విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోరు. తూటాల్లాంటి మాటలతో వారిపై విరుచుకుపడుతుంటాడు.
ఇక మరో నేత, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani). కాపు సామాజికవర్గానికి చెందిన పేర్ని నాని కూడా జగన్ కేబినెట్‌లో మంత్రి పనిచేశారు. మంత్రివర్గ పునర్యవస్థీకరణ తర్వాత ఆయనను సీఎం జగన్ మంత్రి పదవి నుంచి తప్పించారు. అయినా ఆయన నిరుత్సాహ పడలేదు. సీఎం జగన్‌పై పవన్ విమర్శలను పేర్ని నాని ధీటుగా ఎదుర్కొంటారు. పవన్ వ్యాఖ్యలకు పేర్ని నాని గట్టి కౌంటర్ ఇస్తుంటారు. పవన్ కల్యాణ్‌ను ఏకిపారేస్తుంటారు. కాపులను పేరు చెప్తూ ఓట్లు గడుపుకుంటాడని.. కాపులకు పవన్ కల్యాణ్ ఏనాడైనా ఏదైనా చేశారా అని కౌంటర్లు ఇస్తుంటాడు. చంద్రబాబు పాలనను విమర్శించిన పవన్.. నేడు ఆయనతో పొత్తులు ఎలా పెట్టుకుంటారని పలు సందర్భాల్లో ఎండగడుతుంటారు.
మరో నేత ఆళ్ల నాని (Alla Nani).. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2013లో YSRCPలో చేరాడు. 2009-2014 వరకు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు. 2017లో ఎమ్మెల్సీ అయ్యారు. 2019 లో YSRCP నుంచి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గం శాసనసభ సభ్యునిగా పనిచేశాడు . వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రతిపక్షాలపై పదునైన విమర్శలను ఎక్కుపెట్టేందుకు ఎప్పటికీ వెనక్కి తగ్గడు.
ఈరోజే వైసీపీ అధినేత, సీఎం జగన్‌ను కలిసిన కేశినేని నాని (Keshineni Nani).. ఆ తర్వాత చంద్రబాబుపై రెచ్చిపోయాడు. చంద్రబాబు మోసగాడని ప్రపంచానికి తెలుసని.. ఇంత పచ్చిమోసగాడనుకోలేదన్నాడు. చంద్రబాబు అవసరం ఆంధ్రప్రదేశ్‌కు అవసరం లేదని.. ఆయన పని అయిపోందని విమర్శలు మొదలుపెట్టారు. దీంతో నలుగురు నానీలు కలిసి నలు దిక్కుల నుంచి చంద్రబాబుపై దుమ్మెత్తిపోసేందుకు సిద్ధంగా ఉన్నారు. టీడీపీ నేతలు ఈ నానీల దాడిని ఏ మేరకు తట్టుకుంటుందో చూడాలి.