నగరమంటే ట్రాఫిక్ భూతానికి భలే ఇష్టం- పట్టిందంటే, ఎంతకీ వదలకుండా పీడిస్తుంది. రాత్రి లేదు పగలు లేదు ఆల్వేస్ హౌస్ ఫుల్. బండెత్తుకుని బయటకెళ్దామంటే భయం భయం. దీనికి పరిష్కారం త్వరలోనే రాబోతున్నది. కారులో ఆకాశ వీధిలో అందాల జాబిలి అంటూ పాటలు పాడుకుంటూ జుమ్మంటూ గాల్లో ప్రయాణించి రావచ్చు. నిజమే చెబుతున్నానండి. ప్రపంచంలోని మొట్టమొదటి ఎగిరే కారు ఇప్పుడు ఫ్లైట్‌ సర్టిఫికెట్‌ పొందింది.. 177 కిలో మీటర్ల రేంజ్‌తో రూపొందించిన ఎలక్ట్రిక్‌ ఎగిరే కార్లను 2025 చివరి నాటికి కస్టమర్లకు డెలివరీ చేయడం ప్రారంభమవుతుందట. ఈ విషయాన్ని కంపెనీనే చెప్పింది.

నగరమంటే ట్రాఫిక్ భూతానికి భలే ఇష్టం- పట్టిందంటే, ఎంతకీ వదలకుండా పీడిస్తుంది. రాత్రి లేదు పగలు లేదు ఆల్వేస్ హౌస్ ఫుల్. బండెత్తుకుని బయటకెళ్దామంటే భయం భయం. దీనికి పరిష్కారం త్వరలోనే రాబోతున్నది. కారులో ఆకాశ వీధిలో అందాల జాబిలి అంటూ పాటలు పాడుకుంటూ జుమ్మంటూ గాల్లో ప్రయాణించి రావచ్చు. నిజమే చెబుతున్నానండి. ప్రపంచంలోని మొట్టమొదటి ఎగిరే కారు ఇప్పుడు ఫ్లైట్‌ సర్టిఫికెట్‌ (Flight Certificate) పొందింది.. 177 కిలో మీటర్ల రేంజ్‌తో రూపొందించిన ఎలక్ట్రిక్‌ ఎగిరే కార్లను (Electric Cars) 2025 చివరి నాటికి కస్టమర్లకు డెలివరీ చేయడం ప్రారంభమవుతుందట. ఈ విషయాన్ని కంపెనీనే చెప్పింది.

అలెఫ్ ఏరోనాటిక్స్ (Alef Aeronautics) ఈ ఫ్లయింగ్‌ కారును తయారు చేస్తున్నది. ఇప్పుడు ఈ కారు ఎగరడానికి అమెరికా ప్రభుత్వం నుంచి చట్టపరమైన ఆమోదం లభించింది. అమెరికా ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ నుంచి ప్రత్యేకమైన ఎయిర్‌ వర్తీనెస్‌ సర్టిఫికేషన్‌ను పొందినట్టు అలెఫ్‌ ఏరోనాటిక్స్‌ తెలిపింది. అమెరికాలో ఈ రకమైన వాహనానికి, ఇలాంటి సర్టిఫికెట్‌ దొరకడం ఇదే మొదటిసారి అని ఏవియేషన్‌ న్యాయసంస్థ ఏరో లా సెంటర్‌ చెబుతోంది. ఈ ఎగిరే కారుకు సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ఫాక్స్‌ న్యూస్‌ ప్రచురించింది. ఆ కథనం ప్రకారం.. కాలిఫోర్నియాలోని శాన్‌మాటియో కేంద్రంగా ఈ ఫ్లయింగ్‌ కారు తయారయ్యింది. ఇది వందశాతం పూర్తిగా ఎలక్ట్రిక్‌ వాహనమట! ఒకరు లేదా ఇద్దరు ఇందులో ఈజీగా ప్రయాణించవచ్చు. సపోజ్‌ రోడ్లపై ట్రాఫిక్‌ నిలిచిపోయినటప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు ఈ కారు గాల్లో ప్రయాణిస్తుంది. అంటే నేల మీద కారులా రయ్యిమంటూ పరుగెత్తుతూనే అవసరమైనప్పుడు రెక్కలు విచ్చుకుని పక్షిలా ఆకాశంలోకి రివ్వున ఎగరిపోతుంది. ఇందుకు అట్టే టైమ్‌ కూడా పట్టదు. జస్ట్‌ థర్టీ సెకన్స్‌ అంతే. ఆకాశంలో అవసరం తీరి మళ్లీ నేలమీదకొచ్చాక ఆటోమాటిక్‌గా రెక్కలు ముడుచుకుంటాయి. ఈ కారు ధర సుమారు మూడు లక్షల డాలర్లు. మన కరెన్సీలో చెప్పలంటే రెండున్నర కోట్ల రూపాయలు..గత ఏడాది అక్టోబరులో రెండు వర్కింగ్‌ ఫుల్‌సైజు టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్‌ కార్లను ఫుల్‌ సైజ్‌ స్పోర్ట్స్ కార్‌తోపాటు కంపెనీ ఆవిష్కరించింది. తాము తయారు చేస్తున్న ఫ్లయింగ్‌ కార్లకు 440కిపైగా వ్యక్తిగత, కార్పొరేట్‌ కస్టమర్ల నుంచి ముందస్తు ఆర్డర్ల వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. 2025 చివరి నాటికి కస్టమర్లకు ఎగిరే కార్లను డెలివరీ చేయడం ప్రారంభించాలని కంపెనీ అనుకుంటోంది. ప్రపంచంలోనే మొట్టమొదటి నిజమైన ఎగిరే కారును అందించాలన్నదే తమ లక్ష్యమని అలెఫ్‌ ఏరోనాటిక్స్‌ కంపెనీ ఈసీవో జిమ్‌ దుఖోవ్నీ అన్నారు. అధిక సంఖ్యలో ముందస్తు ఆర్డర్లు లభించడం చూస్తే రాబోయే రోజుల్లో ఈ కార్లకు విపరీతమైన డిమాండ్‌ ఉంటుందని అర్థమవుతోంది. సాధారణ పట్టణ, గ్రామీణ రోడ్లపై కూడా ఈ ఫ్లయింగ్‌ కారును నడపవచ్చట. రోడ్డు మీద మాత్రం తక్కువ వేగంతోనే ప్రయాణిస్తుంది. గంటకు పాతిక మైళ్ల వేగాన్ని మించదు. వేగంగా వెళ్లాలనుకుంటే మాత్ర కారును గాల్లోకి లేపి వేగంగా నడపవచ్చు. ఈ కారును ఈజీగా పార్క్‌ చేయచ్చు. ఇకనేం డబ్బలు రెడీ చేసుకోండి.. ట్రాఫిక్ సమస్య నుంచి బయటపడండి..

Updated On 30 Jun 2023 12:49 AM GMT
Ehatv

Ehatv

Next Story