Aishwarya Rai Richest Actress : బాలీవుడ్ రిచెస్ట్ హీరోయిన్గా ఐశ్వర్యరాయ్..
వీటితో పాటు ఐశ్వర్య రాయ్ తెలుగు లో రోబో, విలన్, రావొయి చందమామ లాంటి సినిమాల్లో నటించింది. మరోవైపు ఎండోర్స్ మెంట్ , యాడ్స్ తో ద్వారా కూడా ఈ బ్యూటీ బాగానే సంపాదిస్తోంది అమిర్ ఖాన్, సల్మాన్ , షారుక్ లతో పాటు సమానంగా రెమ్యూనరేషన్ తీసుకున్న సందర్భాలున్నాయి.
బాలీవుడ్ ప్రపంచంలోనే అతిపెద్ద సినీ ఇండస్ట్రీలో ఒకటిగా చెలామణి అవుతోంది. అంతేకాదు బాలీవుడ్ (Bollywod)లో హీరో హీరోయిన్లకు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ కూడా అందుతోంది. ఒక్క సినిమాకే వంద కోట్టకు పైగా తీసుకుంటున్న స్లార్స్ కూడా ఉన్నారు. అయితే సినిమాల్లో బిజీ ఉంటూనే ..మరోవైపు యాడ్స్ , ఇతర ప్రకటనల్లో నటిస్తూ బాగానే సంపాదిస్తున్నారు. ఇప్పటికే మిలినియర్స్ క్లబ్ లో ఉన్నారంటే ..వాళ్ల సంపాదన ఏ రేంజ్ లో ఉందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.
ఐశ్వర్య రాయ్ బచ్చన్(Aishwarya Rai Bachchan) 1994వ సంవత్సరంలో విశ్వసుందరిగా ఎంపికయ్యారామె. ఆమె ఎన్నో సినిమాల్లోనూ యాడ్ లలోనూ నటించారు. ఫిలింఫేర్ పురస్కారాల నామినేషన్ తో పాటు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు ఐశ్వర్య. 2009లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ప్రపంచంలోని అత్యంత అందమైనవారిలో ఒకరిగా ఐశ్వర్యను పేర్కొంటుంటారు
ఐశ్వర్య 1997 లో మణిరత్నం ఇరువర్ లో తొలిసారిగా నటించింది . కొద్దికాలంలోనే బాలీవుడ్ లో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. హమ్ దిల్ దే చుకే సనమ్ , దేవదాస్ , జోధా అక్బర్ వంటి అనేక హిట్ చిత్రాలతో కనిపించి ఆకట్టుకుంది. అయితే ఒక్క సినిమాకు 10 కోట్ల రూపాయల వరకు ఐశ్వర్య వసూలు చేస్తుందని తెలుస్తోంది. వీటితో పాటు ఐశ్వర్య రాయ్ తెలుగు లో రోబో, విలన్, రావొయి చందమామ లాంటి సినిమాల్లో నటించింది. మరోవైపు ఎండోర్స్ మెంట్ , యాడ్స్ తో ద్వారా కూడా ఈ బ్యూటీ బాగానే సంపాదిస్తోంది అమిర్ ఖాన్, సల్మాన్ , షారుక్ లతో పాటు సమానంగా రెమ్యూనరేషన్ తీసుకున్న సందర్భాలున్నాయి.
అయితే 2023 లో బాలీవుడ్(Bollywood)లో అత్యంత ధనిక నటిగా ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai)రికార్డు కెక్కింది. 800 కోట్లకు పైగా నికర ఆదాయంతో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఐశ్వర్యరాయ్ ప్రస్తుతం దేశంలోనే అత్యంత ధనిక నటిగా గుర్తింపు పొందింది. ఈ ప్రపంచ సుందరి అటు బాలీవుడ్ , ఇటు హాలీవుడ్ రెండింటిలోనూ తన అందం, నటనతో అందరిని మెప్పించి సక్సెస్ అయ్యింది. అంతేకాదు సంపాదన కూడా పెరిగింది.