మన పురాణాల్లో ప్రతిపాత్రని వివరించటం జరుగుతుంది . ప్రస్తుతం చారిత్రక వివరాలను సైతం అధ్యయనం చేసి శ్రీ రాముడు 21 ఏళ్ల వయసులో ఎలా ఉంటాడో అనే విషయాన్ని సాంకేతికంగా ఆర్టిఫిషయల్ ఇంటలిజెన్స్AI  సహాయంతో రూపొందించిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది . ఈ ఫోటో ఎవరు తీశారో తెలియదు కానీ ముగ్ద మనోహరమైన శ్రీ రాముని రూపాన్ని చూసిన భక్తులు మాత్రం తన్మయత్వం పొందుతున్నారు . ప్రసంశలు కురిపిస్తున్నారు .

చిన్నపుడు అందరు కధలు వినే ఉంటారు . ఆ కధలలో ఉన్న రూపాలను ఒక్కొక్కరు ఒక్కోలా ఊహించుకుంటాం . ఆ తరువాత టి .వి లు వచ్చాయి. మనం విన్న,చదివిన రామాయణం మహాభారతంల్లో పాత్రలు ఎలా ఉంటాయో మనకు చూపించారు. దానితోనే రాముడు అంటే ఎలా ఉంటాడో ,కృష్ణుడు అంటే ఎలా ఉంటాడో మనకు తెలిసింది . ఇప్పుడు కూడా దేవుడు ఫొటోలో ఉన్న దేవుళ్ళు ముఖాలే మనకు తెలుసు అవి ఎవరు చేసారో ,లేక నిజంగా దేవుళ్ళు అలాగే ఉంటారనే దానికి నిర్దారణ లేదు .

మన పురాణాల్లో ప్రతిపాత్రని వివరించటం జరుగుతుంది . ప్రస్తుతం చారిత్రక వివరాలను సైతం అధ్యయనం చేసి శ్రీ రాముడు 21 ఏళ్ల వయసులో ఎలా ఉంటాడో అనే విషయాన్ని సాంకేతికంగా ఆర్టిఫిషయల్ ఇంటలిజెన్స్AI సహాయంతో రూపొందించిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది . ఈ ఫోటో ఎవరు తీశారో తెలియదు కానీ ముగ్ద మనోహరమైన శ్రీ రాముని రూపాన్ని చూసిన భక్తులు మాత్రం తన్మయత్వం పొందుతున్నారు . ప్రసంశలు కురిపిస్తున్నారు .

రాముని ఆహార్యం వాల్మీకి రామాయణం,రామచరితమానస్ వంటి ,అనేక పుస్తకాల నుండి శ్రీరాముని వివరణను అధ్యయనం చేసిన తర్వాత AI సహాయంతో ఈ ఫోటో రూపొందించబడింది.రాముని పేరు ఎంత అందంగా ఉంటుందో ఈ ఫొటోలో రాముని రూపం కూడా అంతే అందంగా ఉంది. 21 ఏళ్ళ వయసులో ఖచ్చితంగా రాముడు ఇలానే ఉండేవారేమో అన్నట్లు ఉన్న ఈ ఫోటో కి కామెంట్లు వర్షం వెల్లువెత్తుతోంది . ఫొటోలోనే ఇంత అందంగా ఉంటే నిజంలో రాముడు ఇంకా ఎంత అందం గా ఉంటాడో అని user కామెంట్ రాయటం జరిగింది .సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శ్రీరాముడి ఫోటో ఎవరు తీశారు అనే సమాచారం ఇంకా తెలియదు . కానీ ఎవరు ఫోటో తీసినా ఆ వ్యక్తి సృజనాత్మకతపై సోషల్ మీడియా ప్రశంసల వర్షం కురిపిస్తోంది.

Updated On 13 April 2023 3:14 AM GMT
rj sanju

rj sanju

Next Story