ఈ మధ్య కాలంలో సంతానలేమీ(Infertility) సమస్య పెరిగిపోతుంది. సంతానలేమీకి స్త్రీలు(Female)), పురుషులు(Male) ఇద్దరూ కారణమవుతున్నారు. అండాలు(ovum) బలహీనంగా ఉండడం, గర్భాశయం(Uterus), ఓవరీస్‌(Ovaries), పీసీవోడీ(PCOD), థైరాయిడ్‌(Thyroid) సమస్యలు స్త్రీలను వెంటాడితే, స్పెర్మ్‌ కౌంట్(Sperm Count), స్మెర్మ్‌ నాణ్యత సమస్యలు పురుషులను వెంటాడుతున్నాయి. అయితే ఇప్పుడు సంతానలేమీకి మగవారు కూడా 50 శాతం కారణమవుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. ఇలాంటి జంటలకు ఇప్పుడు ఓ కొత్త మార్గం దొరికింది. ఇందుకుగాను పురుషుల వీర్యకణాలను(Sperm) విశ్లేషణకు విప్లవాత్మకమైన కొత్త టెక్నాలజీని(New Technologies) వాడుతున్నారు.. అదే AI.

పురుషుల సంతానోత్పత్తి అంచనాలో వీర్యకణాల విశ్లేషణ కీలకమైన అంశం. మగవారి వీర్యకణాల కదలికలు(Movement), నాణ్యతను(Quality) పరిశీలించేందుకు ఇప్పుడు ఏఐ టెక్నాలజీని(Artificial technology) వాడుతున్నామని వైద్యులు(Doctors) చెప్తున్నారు. ఇది వీర్యకణాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుందని తెలిపారు. సాధారణంగా ఇప్పటివరకు వీర్యకణాల పరిశీలనను మాన్యువల్‌గా(Manual) చేస్తున్నారు. ఇందుకు కొంత సమయం అవసరం.. అంతే కాకుండా మాన్యువల్‌గా చేస్తే కొన్ని అంచనాలు తప్పే అవకాశం ఉంది. AIతో సమర్థవంతంగా, ఖచ్చితంగా(Exact) స్మెర్మ్‌ను విశ్లేషిస్తుందని అంటున్నారు. AI ఆధారిత వ్యవస్థల వల్ల మానవ ప్రమేయం లేకుండా స్మెర్మ్‌ యొక్క పలు అంశాలను వేగవంతంగా, కచ్చితంగా అంచనా వేస్తుందని చెప్తున్నారు. వీర్యకణాలను పరిశీలించేందుకు ఎక్కువ రిజల్యూషన్‌(Resolution) ఉన్న మైక్రోస్కోపీ(Microscopy), మెషిన్‌ లెర్నింగ్‌ అల్గారిథంలను(Machine learning algorithms) ఏఐ ఉపయోగిస్తుందని అంటున్నారు. ఇది సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, లోపాలు లేకుండా పరీక్షల ఫలితాల విశ్వసనీయతను మెరుగుపరుస్తుందని తేల్చారు. అంతే కాదు రోగ నిర్ధారణలో కచ్చితమైన ఫలితాలను అందిస్తోందంటున్నారు. మాన్యువల్‌గా చేస్తే వచ్చే కొన్ని సమస్యలు అస్తెనోజూస్పెర్మియా (తగ్గిన చలనశీలత)(Astheno Spermia), టెరాటోజోస్మెర్మియా (అసాధారణ స్పెర్మ్‌ మార్పొలాజీ)(Teratozoospermia), ఒలిగోజోస్పెర్మియా (తక్కువ స్పెర్మ్‌ కౌంట్)(Oligospermia) వంటి సమస్యలను ఏఐ గుర్తిస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. దీని వల్ల మగవారి వీర్యకణాల్లో ఉండే లోపాలను గుర్తించి అందుకు సరైన చికిత్స అందించడం ద్వారా సంతానం కలిగేందుకు అవకాశం కలుగుతుందని వివరిస్తున్నారు. అత్యంత నాణ్యమైన వీర్యకణాలను గుర్తించి వాటితో IVF, ఇక్సీ(ICSI) చికిత్సను విజయవంతం చేసే అవకాశం ఉందంటున్నారు. అయితే వ్యక్తిగత సమాచార భద్రత, ఏఐని దుర్వినియోంచకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Updated On 28 Nov 2023 1:35 AM GMT
Ehatv

Ehatv

Next Story