మహబూబాబాద్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ తస్లీమా (Sub Registrar Tasleema) మహ్మద్‌ సోషల్‌ మీడియాలో చాలా ఫేమస్‌. ఆదివారం వస్తే చాలు వ్యవసాసపనులకు వెళుతూ, వచ్చిన కూలీ డబ్బులతో ఇతరులకు సాయం చేస్తూ సోషల్‌ మీడియాలో డబ్బా కొట్టుకునేవారు.

మహబూబాబాద్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ తస్లీమా (Sub Registrar Tasleema) మహ్మద్‌ సోషల్‌ మీడియాలో చాలా ఫేమస్‌. ఆదివారం వస్తే చాలు వ్యవసాసపనులకు వెళుతూ, వచ్చిన కూలీ డబ్బులతో ఇతరులకు సాయం చేస్తూ సోషల్‌ మీడియాలో డబ్బా కొట్టుకునేవారు. ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నట్టు బిల్డప్‌ ఇచ్చేవారు. కరోనా టైమ్‌లో నిత్యావసరవస్తువులను మోసుకెళ్లి ప్రజలకు పంచిన వైనాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకున్నారు. ఒకటా రెండా ఇలా చాలా చాలా చేశారు. ఇప్పుడామెనే లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB) అధికారులకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య చెబుతున్నదాని ప్రకారం మహబూబాబాద్‌ జిల్లా (Mahaboobabad) దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన గుండగాని హరీశ్‌ దంతాపల్లిలోనే ఎకరం 28 గుంటలు వ్యవసాయభూమిని కొన్నాడు. ఇందులో 128 గజాల ఇంటిస్థలం రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల మొదటివారంలో సబ్‌ రిజిస్ట్రార్‌ తస్లీమాను సంప్రదించారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి వెంకట్‌ను కలిస్తే పూర్తి వివరాలు చెబుతారని హరీశ్‌ను పంపించారు. ఆమె సూచన మేరకు కార్యాలయ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి ఆలేటి వెంకటేశ్‌ను కలిశారు. ప్రభుత్వ ధర ప్రకారం గజానికి రూ.100 ఉంటుందని, కానీ ఇక్కడ మాత్రం గజానికి రూ.200 చొప్పున ఇస్తేనే రిజిస్ట్రేషన్‌ చేస్తామని వెంకటేశ్‌ చెప్పాడు. దీంతో హరీశ్‌ మళ్లీ సబ్‌ రిజిస్ట్రార్‌ను కలిశాడు. మొత్తం రూ.19,200 ఇస్తేనే రిజిస్ట్రేషన్‌ చేస్తామని తస్లీమా చెప్పారు. వెంటనే హరీశ్‌ వరంగల్‌ ఏసీబీ అధికారులను కలిసి జరిగిందంతా చెప్పారు. ఒప్పందంలో భాగంగా హరీశ్‌ శుక్రవారం కార్యాలయానికి వెళ్లి సబ్‌ రిజిస్ట్రార్‌ తస్లీమాకు డబ్బులు ఇవ్వబోయారు. ఆఫీస్‌లో పనిచేసే వెంకటేశ్‌కు ఇవ్వాలని ఆమె సూచించడంతో బాధితుడు హరీశ్‌ రూ.19,200ను వెంకటేశ్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెంకటేశ్‌ దగ్గర రూ.19,200లతోపాటు అదనంగా 1.72 లక్షలు లభించాయి. అదనపు డబ్బులు ఎవరి నుంచి తీసుకున్నాడనే వివరాలను సేకరిస్తున్నారు. కార్యాలయంలో సోదాలు కూడా నిర్వహించారు. కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు సబ్‌ రిజిస్ట్రార్‌ తస్లీమాతోపాటు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి వెంకటేశ్‌పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్టు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. తస్లీమా ఇలా చేస్తారని ఎవరూ ఊహించి ఉండరు. తస్లీమాకు ఉద్యోగం వచ్చిన తర్వాత ములుగు జిల్లా సబ్‌ రిజిస్ట్రార్‌గా పుష్కరకాలం పాటు అక్కడే ఉన్నారు. గత ఏడాది ట్రాన్సఫర్‌ కావడంతో మహబూబాబాద్‌కు వచ్చారు. ఇప్పుడు ఏసీబీ అధికారుల దాడుల్లో తస్లీమా అసలు నైజం బయటపడింది. కొసమెరుపు ఏంటంటే మంత్రి సీతక్కకు (Minister Seethakka) తస్లీమా చాలా దగ్గరి వ్యక్తి కావడం గమనార్హం

Updated On 22 March 2024 11:04 PM GMT
Ehatv

Ehatv

Next Story