abhishek aishwarya bachchan : విడాకులు తీసుకోనున్న ఐశ్వర్య-అభిషేక్ జోడి..!
ఐశ్వర్య(Aishwarya), అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan)విడాకుల పుకార్లు ఇంకా ఎక్కువయ్యాయి. అభిషేక్ బచ్చన్ పెట్టిన కొత్త పోస్ట్‌తో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. బాలీవుడ్ జంట ఐశ్వర్యతో అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నారంటూ ఈమధ్య కాలంలో చాలా వార్తలు వైరల్(Viral) అవుతున్నాయి. ఇద్దరూ విడివిడిగా జీవిస్తున్నారంటూ బాలీవుడ్‌లో(Bollywood) గుసగుసలు నడుస్తున్నాయి.
ఐశ్వర్య(Aishwarya), అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan)విడాకుల పుకార్లు ఇంకా ఎక్కువయ్యాయి. అభిషేక్ బచ్చన్ పెట్టిన కొత్త పోస్ట్‌తో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.
బాలీవుడ్ జంట ఐశ్వర్యతో అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నారంటూ ఈమధ్య కాలంలో చాలా వార్తలు వైరల్(Viral) అవుతున్నాయి. ఇద్దరూ విడివిడిగా జీవిస్తున్నారంటూ బాలీవుడ్‌లో(Bollywood) గుసగుసలు నడుస్తున్నాయి. అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీలో చీలిక వచ్చిందని అంటున్నారు. ఐశ్వర్యరాయ్ బచ్చన్ కుటుంబ సభ్యులతో విడిపోయిందని అనేక వార్తలు మీడియాలో, సోషల్ మీడియాలో(Social Media) గుప్పు మంటున్నాయి.
తమ కూతురు ఆరాధ్య(Aaradhya Bachchan) స్కూల్‌లో జరిగిన ఈవెంట్‌కు ఈ ఫ్యామిలీ పాల్గొనడంతో అప్పట్లో ఈ వార్తలకు బ్రేక్ పడ్డా.. తాజా అభిషేక్ పోస్టుతో ఈ వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి. కొంత కాలం క్రితం అభిషేక్ ఫోటో ఒకటి వైరలైంది. అభిషేక్ బచ్చన్ పెళ్లి ఉంగరం(Marriage Ring) ధరించకుండానే ఓ ఈవెంట్‌కి వచ్చారు. ఎప్పుడూ ధరించే ఉంగరం లేకపోవడంతో వీడిపోతున్నారన్న ఆజ్యం పోసింది. అభిషేక్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) ఒక కామెంట్‌ను పోస్ట్ చేశాడు. అదేంటంటే 'కలలను 'పరాజయ భయం' నాశనం చేస్తుంది. కానీ పరాజయం నుంచి పాఠం నేర్చుకుంటే కలలు నిజమవుతాయని' అభిషేక్ రాసుకొచ్చాడు. దీంతో వీరిద్దరి విడాకుల(Divorce) మరోసారి గాసిప్స్ వస్తున్నాయి. కానీ విడాకులపై ఇంకా స్పష్టత రాలేదు.