ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ప్రయోజనాలు సరిగ్గా అందించేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు, అప్‌డేట్‌లను అందుబాటులోకి తీసుకువస్తుంది కేంద్రం. ఇందులో భాగంగా ఇప్పుడు పీఎం కిసాన్ పథకంలో రైతులకు ప్రయోజనాలు అందించేందుకు కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేసింది . ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ ద్వారా వ్యక్తిని గుర్తించే ఫీచర్ తీసుకువచ్చింది. ఈ ఫీచర్ PM కిసాన్ యాప్‌లో అందుబాటులో ఉంది. e-KYCని పూర్తి చేయడానికి ఇది సులువైన మార్గం. కొద్ది రోజులుగా చాలామంది రైతుల వేలిముద్రలు ఆధార్ డేటాతో సరిపోలడం లేదని ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఈ కొత్త అవకాశం కల్పించింది.

ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ప్రయోజనాలు సరిగ్గా అందించేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు, అప్‌డేట్‌లను అందుబాటులోకి తీసుకువస్తుంది కేంద్రం. ఇందులో భాగంగా ఇప్పుడు పీఎం కిసాన్ పథకంలో రైతులకు ప్రయోజనాలు అందించేందుకు కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేసింది . ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ ద్వారా వ్యక్తిని గుర్తించే ఫీచర్ తీసుకువచ్చింది. ఈ ఫీచర్ PM కిసాన్ యాప్‌లో అందుబాటులో ఉంది. e-KYCని పూర్తి చేయడానికి ఇది సులువైన మార్గం. కొద్ది రోజులుగా చాలామంది రైతుల వేలిముద్రలు ఆధార్ డేటాతో సరిపోలడం లేదని ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఈ కొత్త అవకాశం కల్పించింది. జూన్ 22 న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్న జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ ఫీచర్‌ను ఆవిష్కరించారు. భారతదేశంలో ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం ఈ ఫీచర్‌ని ఉపయోగించడం ఇదే మొదటిసారి .

దీనిని PM కిసాన్ యోజన e - KYCని పూర్తి చేయడానికి రూపొందించారు. e-KYC ఆధార్ వేలిముద్ర ఇవ్వడం ద్వారా లేదా ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌కు పంపిన OTPని ఉపయోగించడం ద్వారా చేయాలి. కానీ వృద్ధుల ఆధార్ వేలిముద్రలు పనిచేయడం లేదని దేశవ్యాప్తంగా ఫిర్యాదులు ఉన్నాయి. ఇది పీఎం కిసాన్‌కే కాకుండా రేషన్ కార్డు తదితర పథకాలకు కూడా పెద్ద సమస్యగా మారింది. ఈ క్రమంలోనే ఇప్పుడు PM కిసాన్ మొబైల్ యాప్‌లో ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ ద్వారా వేలిముద్ర ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ లబ్ధిదారుడైనా యాప్‌లో ఈ ఫీచర్‌ని ఉపయోగించవచ్చు. మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేసిన వ్యక్తులు, వృద్ధులకు ఈ యాప్ ఉపయోగపడుతుంది .

గత మే 21 న PM కిసాన్ మొబైల్ యాప్‌లో ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ ట్రయల్ టెస్ట్ ప్రారంభించబడింది. ఈ ఫీచర్ ద్వారా ఇప్పటివరకు 3 లక్షల మంది రైతుల e-KYC పూర్తి చేశారు. ఇక ఇప్పుడు ఈ ఫీచర్ అధికారికంగా PM కిసాన్ మొబైల్ యాప్‌లో ప్రారంభించబడింది. చాలా మంది లబ్ధిదారులు e - KYC చేయనివారికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

ఫీచర్ ఎలా పని చేస్తుంది.?

ఆధార్ కార్డును తయారు చేసినప్పుడు బయోమెట్రిక్ సమాచారం ఉంటుంది. అందులో వేలిముద్ర, ఐరిస్ గుర్తింపు కూడా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ చేతి వేళ్ల చర్మం అరిగిపోవడంతో వేలిముద్రలు కనిపించవు. అప్పుడు కనుపాప గుర్తు పనికి వస్తుంది. పీఎం కిసాన్ పథకంలో ఈ సౌకర్యం కల్పించబడింది . అర్హులైన లబ్ధిదారులకు సహయం అందించేందుకు దీనిని రూపొందించారు. ఇక పీఎం కిసాన్ 14వ విడత నగదును వచ్చే వారంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

Updated On 23 Jun 2023 8:26 AM GMT
Ehatv

Ehatv

Next Story