Mumbai Airport Incident : ఎయిర్‌పోర్టులో యువకుడి భిక్షాటన... అవాక్కయిన పోలీసులు
ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అడుక్కునే వాళ్లను చూశాం! బస్టాండ్‌లో బిక్షాటన చేసేవాళ్లనూ చూశాం! రైల్వేస్టేషన్‌లో ముష్టి ఎత్తుకునేవాళ్లను కూడా చూశాం! కానీ ఎయిర్‌పోర్టులో(Airport) ఎవరైనా అడుక్కోవడం చూశారా? ముంబాయి(Mumbai) విమానాశ్రయంలో ఇలాంటిది చోటు చేసుకుంది. విఘ్నేశ్(Vignesh) అనే 27 ఏళ్ల యువకుడు ఎయిర్‌పోర్ట్‌లోని ప్రయాణికుల దగ్గర భిక్షాటన చేశాడు.
ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అడుక్కునే వాళ్లను చూశాం! బస్టాండ్‌లో బిక్షాటన చేసేవాళ్లనూ చూశాం! రైల్వేస్టేషన్‌లో ముష్టి ఎత్తుకునేవాళ్లను కూడా చూశాం! కానీ ఎయిర్‌పోర్టులో(Airport) ఎవరైనా అడుక్కోవడం చూశారా? ముంబాయి(Mumbai) విమానాశ్రయంలో ఇలాంటిది చోటు చేసుకుంది. విఘ్నేశ్(Vignesh) అనే 27 ఏళ్ల యువకుడు ఎయిర్‌పోర్ట్‌లోని ప్రయాణికుల దగ్గర భిక్షాటన చేశాడు. ఎయిర్‌పోర్ట్‌లోపలకి వెళ్లడానికి చెన్నైకు ఓ ఫ్లయిట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. ఆ టికెట్‌తో ఎయిర్‌పోర్ట్ లోపలికి వెళ్లాడు. అక్కడున్న ప్రయాణికుల దగ్గర తన తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడనీ, హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌కు డబ్బులు లేవని చెబుతూ డబ్బులు తీసుకునేవాడు..
ఎయిర్‌పోర్ట్ కాబట్టి చిన్న అమౌంట్ అడిగితే బాగోదనుకున్నాడో ఏమో ఒక్కొక్కరి దగ్గర ఏడు వేలు, పది వేల రూపాయలు అడిగి తీసుకున్నాడు. అతడి వాలకం చూసి కొందరికి డౌట్ వచ్చింది. పోలీసులకు సమాచారం అందించారు. వారు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి అతడిని అరెస్ట్ చేశారు. 420 సెక్షన్ కింద చీటింగ్ కేసు నమోదు చేశారు. విఘ్నేశ్‌ను సోదా చేస్తే అతడి దగ్గర 26 క్రెడిట్ కార్డుల దొరికాయి. అందులో 24 క్రెడిట్ కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయని అధికారులు చెప్పారు. కొందరు ఒక ముఠాగా ఏర్పడి ఇలా భిక్షాటన చేస్తున్నారని, విఘ్నేశ్ ఆ గ్యాంగ్‌లోని వాడేనని పోలీసులు అంటున్నారు. ఎయిర్‌పోర్ట్‌లలో ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి. రెండేళ్ల కిందట బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో ఇలాంటి ఘటనే జరిగింది.