Bungee Jumping : యువతి బంగీజంప్ చేస్తుండగా తాడు తెగింది!
బంగీజంప్(bungee jump) అందరికీ సాధ్యం కాదు.. గుండె ధైర్యం టన్నుల్లో ఉంటే తప్ప అలాంటి ఫీట్‌ను చేయలేం! అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో ఒకటైన బంగీ జంప్ కాస్త రిస్క్‌తో కూడిన వ్యవహారమే! పుసుక్కున తాడు తెగిందే అనుకోండి, మన ప్రాణం పుట్టుకుమని పోతుంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఓ యువతి బంగీజంప్‌కు సంసిద్ధమయ్యింది.
బంగీజంప్(bungee jump) అందరికీ సాధ్యం కాదు.. గుండె ధైర్యం టన్నుల్లో ఉంటే తప్ప అలాంటి ఫీట్‌ను చేయలేం! అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో ఒకటైన బంగీ జంప్ కాస్త రిస్క్‌తో కూడిన వ్యవహారమే! పుసుక్కున తాడు తెగిందే అనుకోండి, మన ప్రాణం పుట్టుకుమని పోతుంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఓ యువతి బంగీజంప్‌కు సంసిద్ధమయ్యింది. ఆపరేటర్ ఆమెను లాంచింగ్ ప్యాడ్ నుంచి కిందకు తోసేశాడు. బంగీజంపింగ్ మధ్యలో ఉన్నప్పుడే కాళ్లకు కట్టన తాడు తెగిపోయింది. అదృష్టం బాగుండి కింద నీళ్లలో పడిపోయింది. లేకపోతే తల వెయ్యి తునకలు అయ్యేది. కాకపోతే ఆ యువతి ఇప్పుడు ఎలా ఉందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. చూస్తుంటూనే ఒళ్లు జలదరించే ఆ భయానకమైన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో, ఎప్పుడు జరిగిందో ఎవరికీ తెలియదు. నెటిజన్లలో చాలా మంది ఆమె సురక్షితంగానే ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి అవుతానని ఆశిస్తున్నానని, సీఎల్పీ భేటిలో మెజార్టీ ఎమ్మెల్యేలు తనను ముఖ్యమంత్రిగా కోరుకున్నారని సిద్ధరామయ్య తెలిపారు. అయినప్పటికీ అధినాయకత్వం నిర్ణయానికే కట్టుబడి ఉంటానని, డీకే శివకుమార్‌తో తనకు మంచి స్నేహం ఉందని 75 ఏళ్ల సిద్ధరామయ్య తెలిపారు. సిద్ధరామయ్య వెంట దళిత, గిరిజన, మైనారిటీ, ఓబీసీ సామాజికవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారని సమాచారం.