పొద్దస్తమానం ఫోన్‌(phone) చూసుకుంటూ ఉంటే ఇంటిపనులెలా? సరిగ్గా ఈ ప్రశ్ననే నవ వధువును అడిగారు అత్తమామలు. అలా ఫోన్‌ చూస్తూ ఉండొద్దని మందలించారు. అత్తమామలు ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం ఆ నవ వధువును బాధించాయి. తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె తన భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. బీహార్‌లోని(bihar) వెళ్లింది. ఈ ఘ‌ట‌న బీహార్‌లోని హాజీపూర్‌లో వెలుగు చూసింది.

పొద్దస్తమానం ఫోన్‌(phone) చూసుకుంటూ ఉంటే ఇంటిపనులెలా? సరిగ్గా ఈ ప్రశ్ననే నవ వధువును అడిగారు అత్తమామలు. అలా ఫోన్‌ చూస్తూ ఉండొద్దని మందలించారు. అత్తమామలు ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం ఆ నవ వధువును బాధించాయి. తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె తన భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. బీహార్‌లోని(bihar) వెళ్లింది. ఈ ఘ‌ట‌న బీహార్‌లోని హాజీపూర్‌లో వెలుగు చూసింది. ఇలియాస్‌ అనే వ్యక్తికి సాబా ఖతూన్‌ అనే అమ్మాయికి ఈ మధ్యనే పెళ్లయింది. సాబా అత్తారింట్లో అడుగుపెట్టింది. ఆమె సోషల్‌ మీడియాలో యాక్టివో కాదో తెలియదు కానీ ఇన్‌స్టాగ్రామ్‌(Instagram), ఫేస్‌బుక్‌లను(book) మాత్రం అదేపనిగా చూస్తుంటుంది. నిరంతరం ఫోన్‌లో గడుపుతున్న కోడలిని చూసి అత్తమామాలకు కొంచెం కోపం వచ్చింది.

ఫోన్‌తోనే రోజంతా గడపడం బాగోలేదని మందలించారు. భర్త కూడా ఇదే మాట అన్నాడు. అంతే సాబాకు కోపం వచ్చేసింది. తల్లిదండ్రులకు, సోదరుడికి ఫోన్‌ చేసి ఫోన్‌ గొడవ గురించి చెప్పుకుంది. సాబా ఖతూన్‌ సోదరుడికి కోపం నషాళానికి అంటింది. బావ అని కూడా చూడకుండా ఇలియాస్‌ను తుపాకీతో బెదిరించాడు. అటు తిరిగి ఇటు తిరిగి ఈ విషయం పోలీసులకు తెలిసంది. వారు ఇలియాస్ ఇంటికి వచ్చి సాబా సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. సాబా తల్లి వెర్షన్‌ మాత్రం మరో రకంగా ఉంది. తన కూతురుకు ఉన్న ఫోన్‌ను బలవంతంగా లాక్కున్నారని, కనీసం తమతో ఫోన్‌లో మాట్లాడేందుకు కూడా ఆమెకు అత్తమామలు అనుమతించడం లేదని సాబా తల్లి అంటున్నారు. సాబా మాత్రం అత్తారింటికి వెళ్లనంటే వెళ్లనని భీష్మించుకుంది.

Updated On 1 Jun 2023 5:15 AM GMT
Ehatv

Ehatv

Next Story