ప్రియుడి మోజులో పడ్డ ఓ భార్య కట్టుకున్న భర్త అన్న కనికరం లేకుండా అతి దారుణంగా చంపించింది. 'తొడ సంబంధం 90 ఏళ్లయినా పోదు' అని వెనుకటికి పెద్దలు చెప్పినట్లు పెళ్లికి ముందు నుంచే ప్రియుడితో ఏర్పడిన వివాహేతర సంబంధాన్ని పెళ్లయిన తర్వాత కూడా కొనసాగించింది. ఇక ఈ విషయం ఎప్పటికైనా భర్తకు తెలుస్తుందని పెద్ద ప్లానే వేసింది. భర్త పేరుతో ఉన్న ఆస్తులు అమ్ముకొని ప్రియుడితో కులుకొచ్చని కుట్రకు తెరలేపింది.
ప్రియుడి మోజులో పడ్డ ఓ భార్య కట్టుకున్న భర్త అన్న కనికరం లేకుండా అతి దారుణంగా చంపించింది. 'తొడ సంబంధం 90 ఏళ్లయినా పోదు' అన్న పాత సామెతను నిజం చేస్తూ పెళ్లికి ముందు నుంచే ప్రియుడితో ఏర్పడిన వివాహేతర సంబంధాన్ని పెళ్లయిన తర్వాత కూడా కొనసాగించింది. భర్త పేరుతో ఉన్న ఆస్తులు అమ్ముకొని ప్రియుడితో కులుకొచ్చని కుట్రకు తెరలేపింది. ఇద్దరు పిల్లలున్నా సిగ్గూ, ఎగ్గూ లేకుండా విచక్షణారహితంగా ప్రవర్తించింది. పైగా తనకు ఏమీ తెలియదనట్లు, భర్తకు గుండెపోటు వచ్చినట్లు నాటకమాడిందీ నంగనాచి. ఈ కామాంధురాలి మాటలు నమ్మిన బంధువులు హతుడి మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. మూడు నెలల తర్వాత ఈ నటరాణి నాటకం బయటపడింది. అటు తండ్రిని కోల్పోయి, ఇటు తల్లి జైలుకు వెళ్లడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.
ఎక్కడో కాదు హైదరాబాద్‌లోని ఎల్లారెడ్డిగూడ (YellareddyGuda) జయప్రకాష్‌నగర్‌లో (JayaprakashNagar) ఈ ఘటన చోటు చేసుకుంది. మధురానగర్ పోలీసులు (Madhuranagar Police) తెలిపిన కథనం ప్రకారం శిఖర అపార్ట్‌మెంట్స్‌లో విజయకుమర్ (40) (Vijaykumar), శ్రీలక్ష్మి (33) (Srilakshmi) దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒకరికి 9 ఏళ్లు, మరొకరికి 8 ఏళ్లు. పెళ్లికి ముందే శ్రీలక్ష్మికి రాజేష్ (30) (Rajesh) అనే వ్యక్తితో ఎఫైర్ ఉంది. అది పెళ్లయిన తర్వాత కూడా గుట్టుగా కొనసాగించింది. వీరి తొడ సంబంధం ఎప్పటికైనా బయటపడుతుందని భావించారు. భర్తకు ఈ విషయం తెలిస్తే.. ఇంకేమైనా ఉందా అని అనుకున్నారు. దీంతో భర్తను తొలగించాలని శ్రీలక్ష్మి భావించింది. ఇందుకు తన ముద్దుల ప్రియుడు రాజేష్‌తో కలిసి పెద్ద స్కెచ్చే వేసింది. భర్త విజయ్‌కుమార్ పేరు మీద హైదరాబాద్‌లో రెండు ఇళ్లు కూడా ఉన్నాయి. విజయ్‌ను చంపితే ఆస్తి దక్కుతుందని దీంతో ఇద్దరూ కులుకొచ్చని భావించారు. రాజేష్ కూడా భుజాలు ఎగరేసుకుంటూ అందుకు సరేనన్నాడు. ఇందుకు ఓ రౌడీషీటర్ పటోళ్ల రాజేశ్వర్‌రెడ్డి సాయం తీసుకున్నాడు. విజయ్, శ్రీలక్ష్మి తొలుత ఎల్లారెడ్డిగూడలోని సొంతింట్లో ఉండేవారు. కానీ అక్కడయితే వీరి బండారం బయటపడుతుందని భావించిన శ్రీలక్ష్మి వాస్తు పేరుతో మకాం శిఖర అపార్ట్‌మెంట్‌కు మార్చింది. ఇక విజయ్‌ను చంపేందుకు రాజేశ్వర్‌రెడ్డి, మహ్మద్ మైతాబ్ అలియాస్ బబ్బన్‌కు బాగానే ముడుపులు మూట కట్టి ఇచ్చింది.
అభం శుభం తెలియన విజయ్ ఫిబ్రవరి 1న తన పిల్లలను స్కూల్లో దింపేందుకు వెళ్లాడు. పథకం ప్రకారం విజయ్ స్కూల్‌కు వెళ్లగానే నిందితులు రాజేష్, రాజేశ్వర్‌రెడ్డి, మైతాబ్‌ను ఇంటికి పిలిపించింది. వారు వచ్చాక బాత్‌రూంలో దాచి గడియపెట్టింది. విజయ్ ఇంటికి తిరిగిరాగనే మెయిన్ డోర్ గడియపెట్టింది. బాత్‌రూం నుంచి బయటకొచ్చిన నిందితులు రాజేష్, రాజేశ్వర్‌రెడ్డి, మైతాబ్ ముగ్గురూ ఇనుప రాడ్లు, డంబెళ్లతో విజయ్ తలపై చితకబాదారు. ఈ సమయంలో రాజేష్ ఎంత వేడుకున్నా కనికరించలేదు. చంపి బాత్‌రూంలో పడేసి వెళ్లిపోయారు. ఇక ఈ నంగనాచి తన పని తాను చేసింది. ఇంట్లో పడిన రక్తపు మరకలను జాగ్రత్తగా తుడిచి వేసి, విజయ్ బట్టలను మార్చింది. ఇక ఇక్కడి నుంచి తన నటనా ప్రావీణ్యాన్ని చాటింది. భర్తకు గుండెపోటు వచ్చిందని, బాత్‌రూంలో కింద పడి తల పగిలి చనిపోయిందని మహానటి లెవల్లో బిల్డప్ ఇచ్చి బోరున విలపించింది. భర్త మీద ఎంత ప్రేమ ఉందో అని నమ్మిన బంధువులు.. ఈమె చెప్పిన విషయాన్ని నమ్మి అంత్యక్రియలు చేశారు. వాస్తవానికి విజయ్ కుటుంబ ఆచారం ప్రకారం చనిపోయినవారిని పూడ్చి పెడతారు. ఎప్పటికైనా నిజం బయటపడుతుందని.. విజయ్ మృతదేహానికి అంత్యక్రియలు చేయించింది నిందితురాలు శ్రీలక్ష్మి. హత్య తర్వాత రాజేశ్వర్‌రెడ్డి వికారాబాద్ (Vikarabad) వెళ్లిపోయాడు. మెల్లమెల్లగా రాజేశ్వర్‌రెడ్డిలో అంతర్మథనం మొదలైంది. హత్య చేసే సమయంలో విజయ్ వేడుకున్న తీరు అతనిలో కలచివేసింది. తనను చంపకూడదని ఎంతగా వేడుకున్నాడో అని, విజయ్ ఆర్తనాదాలు గుర్తుచేసుకుని కుంగిపోయాడు. దీంతో మనోవ్యాధికి లోనైన రాజేశ్వర్‌రెడ్డి మధురానగర్ పోలీసుల ఎదుట లొంగిపోయి విషయమంతా కక్కాడు. రాజేశ్వర్‌రెడ్డిపై ఇప్పటికే పలు స్టేషన్లలో ఎనిమిదికిపైగా కేసులున్నాయి. రాజేశ్వర్‌రెడ్డి ఇచ్చిన సమాచారంతో నిందితులు శ్రీలక్ష్మి, రాజేష్, మైతాబ్‌లను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితులపై 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు పోలీసులు.