ప్రేమికులు(Lovers) సుఖాలనే కాదు, కష్టాలను పంచుకోవాలి. ప్రియురాలికి కడదాక అండగా నిలబడగలగాలి. ప్రేయసి కష్టాల్లో ఉంటే ఆమెను ఆదుకోకుండా పారిపోయేవాడు ప్రియుడు ఎలా అవుతాడు? ఆమె ప్రాణాలు ప్రమాదంలో పడితే తన ప్రాణ రక్షణ కోసం పరుగెత్తేవాడిని ప్రియుడని ఎలా అనగలం? సరిగ్గా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఒక ప్రేమ జంట చేతిలో చేయి వేసుకుని నడుస్తూ ఉన్నారు.

ప్రేమికులు(Lovers) సుఖాలనే కాదు, కష్టాలను పంచుకోవాలి. ప్రియురాలికి కడదాక అండగా నిలబడగలగాలి. ప్రేయసి కష్టాల్లో ఉంటే ఆమెను ఆదుకోకుండా పారిపోయేవాడు ప్రియుడు ఎలా అవుతాడు? ఆమె ప్రాణాలు ప్రమాదంలో పడితే తన ప్రాణ రక్షణ కోసం పరుగెత్తేవాడిని ప్రియుడని ఎలా అనగలం? సరిగ్గా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఒక ప్రేమ జంట చేతిలో చేయి వేసుకుని నడుస్తూ ఉన్నారు. వారిద్దరి మనసులు ఎంతగా కలిసిపోయాయంటే ఇద్దరూ ఒకే రంగు దుస్తులు(Twining) ధరించేటంతగా! చక్కగా మ్యాచింగ్‌ డ్ర్సులు వేసుకుని కబర్లు చెప్పుకుంటూ నడుస్తూ వెళుతున్నారు. ఇంతలో బైక్‌పై ఇద్దరు దొంగలు(Thieves) వచ్చారు. వారిని అడ్డుకున్నారు. కత్తితో బెదిరించారు. అంతే.. అమ్మాయిని వదిలేసి ఆ అబ్బాయి పరుగందుకున్నాడు(Runway)..

పాపం ఆ అమ్మాయి బిత్తరపోయింది. భయం భయంగానే తన దగ్గర ఉన్న బ్యాగును దొంగకు అప్పగించింది. పారిపోతున్న ప్రియుడివైపు దీనంగా చూస్తూ నిలబడింది. దొంగోడి కంటే ప్రియుడి తీరే ఆమెను ఎక్కువగా బాధపెట్టింది. పాపం ఆ అమ్మాయి బాధను దొంగ గుర్తించాడు. అతడి మనసు కరిగిపోయింది. బైక్‌ ఎక్కి పారిపోదామనుకున్న దొంగ ఆ బ్యాగును ఆమెకు ఇచ్చేశాడు. సారీ చెప్పాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన నెటిజట్లు తలో రకంగా స్పందించారు. ప్రేమపరీక్షలో ప్రియుడుఫెయిలయ్యడని కొందరు, లవర్‌ పారిపోకపోతే దొంగకు సానుభూతి కలిగేది కాదని మరికొందరు కామెంట్‌ చేశారు. చాలా మంది మాత్రం దొంగను మెచ్చుకుంటున్నారు.

Updated On 29 Jun 2023 12:49 AM GMT
Ehatv

Ehatv

Next Story