Roller Coasters : మధ్యలో ఆగిపోయిన రోలర్ కోస్టర్, తలకిందులుగా వేలాడుతూ నరకయాతన...!
చాలా మంది జెయింట్ వీల్(Giantwheel), రోలర్ కోస్టర్‌లంటే(Rollercoster) తెగ ఇష్టపడతారు. వాటిల్లో ఎక్కి సంబరపడతారు. కాసేపు భయపెట్టిస్తాయి కానీ తర్వాత మాత్రం మహదానందాన్ని కలిగిస్తాయి. కాకపోతే అనుకోని ప్రమాదాలు ఎదురైతేనే కష్టం. యాంత్రికంగా ఏవైనా సమస్యలు వస్తే మాత్రం ప్రాణాలు గుప్పిట పెట్టుకుని దేవుడి మీద భారం వేయాల్సి వస్తుంది.
చాలా మంది జెయింట్ వీల్(Giantwheel), రోలర్ కోస్టర్‌లంటే(Rollercoster) తెగ ఇష్టపడతారు. వాటిల్లో ఎక్కి సంబరపడతారు. కాసేపు భయపెట్టిస్తాయి కానీ తర్వాత మాత్రం మహదానందాన్ని కలిగిస్తాయి. కాకపోతే అనుకోని ప్రమాదాలు ఎదురైతేనే కష్టం. యాంత్రికంగా ఏవైనా సమస్యలు వస్తే మాత్రం ప్రాణాలు గుప్పిట పెట్టుకుని దేవుడి మీద భారం వేయాల్సి వస్తుంది. అమెరికాలోని(America) క్రాండన్ పార్క్ ఫారెస్ట్ కౌంటీ ఫెస్టివల్‌లో(Crandon Park Forest County Festival) ఇలాగే జరిగింది. ఓ అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో నిండా జనంతో ఉన్న రోలర్ కోస్టర్ రైడ్ జరుగుతుండగా మధ్యలో ఆగిపోయింది. అందులో ఉన్న వారు సుమారు మూడు గంటల పాటు నరకయాతన అనుభవించారు. కొన్ని సాంకేతిక సమస్యలతో కోచ్ మధ్యలోనే ఆగిపోయింది. అందులో స్వారీ చేస్తున్నవారు తలకిందులుగా వేలాడుతూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఏ మాత్రం పట్టుతప్పినా దారుణం జరిగి ఉండేది. అదృష్టం బాగుంది కాబట్టి అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఆగిపోయిన రోలర్ కోస్టర్‌లో ఎనిమిది మంది ఉండగా అందులో ఏడుగురు చిన్నారులే! మెకానికల్ సమస్య కారణంగానే రోలర్ కోచ్ మధ్యలో ఆగిపోయిందని, ఎందుకిలా జరిగిందో తెలియడం లేదని ఫెస్టివల్ నిర్వాహకులు అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.