ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) బారాంబంకీలో(Barambanki) భయంకరమైన సంఘటన ఒకటి వెలుగు చూసింది. మోహరిపుర్వా(Moharipurva) ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలు పది రోజులుగా తన 18 ఏళ్ల మనువడి(Grandson) మృతదేహంతో(Deadbody) సావాసం చేస్తూ వచ్చింది. శవాన్ని తనతో పాటే ఉంచుకుని దానికి రోజూ స్నానం చేయిస్తూ, దుస్తులు మారుస్తూ వచ్చింది.

ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) బారాంబంకీలో(Barambanki) భయంకరమైన సంఘటన ఒకటి వెలుగు చూసింది. మోహరిపుర్వా(Moharipurva) ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలు పది రోజులుగా తన 18 ఏళ్ల మనువడి(Grandson) మృతదేహంతో(Deadbody) సావాసం చేస్తూ వచ్చింది. శవాన్ని తనతో పాటే ఉంచుకుని దానికి రోజూ స్నానం చేయిస్తూ, దుస్తులు మారుస్తూ వచ్చింది. మృతదేహం నుంచి భరించలేనంత దుర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చింది.

వారు పోలీసులకు కంప్లయింట్‌ చేశారు. పోలీసులు ఘటనస్థలానికి వచ్చి ఆ ఇంటి తలుపులు తెరిచారు. అంతే భయంతో వణికిపోయారు. గదిలో ఒక వృద్ధురాలు తన మనవడి మృతదేహాన్ని తన దగ్గరే పెట్టుకోవడం గమనించారు. ఆ శవం పురుగులు పట్టి, కుళ్లిపోయిన(Decompose) స్థితిలో ఉండాన్ని పోలీసులు గుర్తించారు. గదిలోంచి విపరీతంగా వచ్చిన దుర్గంధం(Bad smell) పోలీసులకు వాంతులు(Vomits) తెచ్చిపెట్టింది. కొందరు అక్కడ్నుంచి పారిపోయి బయటకు వచ్చేశారు.

కాసేపయ్యాక పోలీసులు తమను తాము నియంత్రించుకుని ఆ వృద్ధురాలిని ప్రశ్నించారు. తన మనవడు పది రోజుల కిందట చనిపోయాడని మాత్రమే చెప్పిందామె! ఎందుకు మృతదేహాన్ని పక్కన పెట్టుకున్నవాన్నదానికి జవాబివ్వలేదు. ఆ బామ్మను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆమెకు మతి స్థిమితం(Mental illness) లేదని చెప్పిన స్థానికులు ఆ యువకుడు ఎలా చనిపోయాడన్నది మాత్రం తమకు తెలియదన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువకుడు ఎలా మృతి చెందాడనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు.

Updated On 26 Jun 2023 5:52 AM GMT
Ehatv

Ehatv

Next Story