A Man Died Out Of Alcohol : అన్ని కాక్ టెయిల్ డ్రింకులు తాగేద్దామనుకున్నాడు.. సగం తాగి చచ్చిపోయాడు
మితిమీరిన మద్యం ఒక్కోసారి ప్రాణాలు కూడా తీస్తుంది. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ తిమోది సదరన్‌నే! పాపం ఫ్యామిలీతో విహారయాత్రకు వెళ్లిన అతడు ఇష్టం వచ్చినట్టుగా కాక్ టెయిల్(Cocktails) డ్రింక్‌లు తాగాడు. తర్వాత గగ్గొలు పెట్టాడు. వాంతులు చేసుకున్నాడు. అటు పిమ్మట చనిపోయాడు.. అసలేం జరిగిందో డిటైల్డ్‌గా తెలుసుకుందాం! బ్రిటన్‌కు(Britain) చెందిన 53 ఏళ్ల తిమోతి సదరన్ తన ఫ్యామిలీ మెంబర్లతో కలిసి హాలీడే ట్రిప్ కోసం జమైకా(Jamaica) వెళ్లాడు. ఎంజాయ్ చేయడానికి వచ్చాక లిక్కర్ పుచ్చుకోకపోతే బాగుండదని అనుకున్నాడు.

వారు బస చేసిన హోటల్ దరిదాపుల్లో బార్లు గట్రాలు ఉన్నాయేమో ఎంక్వైరీ చేశాడు. దగ్గర్లోనే డికామెరూన్ క్లబ్ కరేబియన్ బార్ ఉందని తెలుసుకుని క్షణం ఆలస్యం చేయకుండా అక్కడికి వెళ్లాడు. బార్ మెను చూశాడు. మొత్తం 21 కాక్ టెయిల్ డ్రింకులు ఉన్నాయని చూశాడు. ఆ కాక్ టెయిల్ డ్రింకులన్నింటినీ ట్రై చేయాలనుకున్నాడు. 12 రకాల కాక్ టెయిల్ డ్రింకులు తాగేసరికి మనోడికి చుక్కలు కనిపించాయి. తాగడం ఆపేసి హోటల్‌కు వెళ్లిపోయాడు. రూమ్‌లో చాలా సేపు ఇబ్బంది పడ్డాడు. అతడి అవస్థ చూసి అంబులెన్స్ కోసం కేకలు పెట్టారు కుటుంబసభ్యులు. అయినా ఎవరూ పట్టించుకోలేదు.
కాసేపు నొప్పితో విలవిలాడిపోయాడు తిమోతి. గగ్గోలు పెట్టి వాంతులు చేసుకున్నాడు. తర్వాత కిందపడిపోయాడు. కుటుంబసభ్యులు ఎంత పిలిచినా ఉలుకుపలుకు లేకపోవడంతో ఆందోళన చెందారు. తీరా చూస్తే తిమోతి చనిపోయాడని తెలిసింది. అక్కడే ఉన్న ఓ నర్సు అంబులెన్స్‌కు కబరు పెట్టిందేమోనని అనుకున్నామని, కాని ఆమె ఆ పని చేయలేదని, ఈ లోపే తిమోతి చనిపోయాడని ఫ్యామిలీ మెంబర్లలో ఒకరు చెప్పారు. తెల్లవార్లూ బ్రాందీ, బీర్లు తాగి ఉన్న తిమోతికి బార్‌లో ఇద్దరు కెనడా యువతులు పరిచయమయ్యారని, వారిలో ఒకరి బర్త్‌డే సందర్భంగా సవాల్‌గా తీసుకుని 21 కాక్ టెయిల్ డ్రింకులు తాగే ప్రయత్నం చేశాడని పోలీసుల ఎంక్వైరీలో తేలింది. అలా తాగడం వల్లనే అక్యూట్ గ్యాస్ట్రో ఎంటరైటిస్‌తో చనిపోయాడని పోలీసులు చెప్పారు.