న్యాయవాద(Law) వృత్తిలో 16 సంవత్సరాల అపార అనుభవం ఉందాయనకు! విడాకుల(Divorce) కోసం ఆయన దగ్గరకు వచ్చే దంపతులకు కౌన్సిలింగ్‌(Counselling) చేసి వారు మనసు మార్చుకునేలా చేయగల నేర్పరి. గమ్మత్తేమిటంటే ఎన్నో జంటలను విడిపోకుండా కాపాడిన ఈయనే భార్య నుంచి విడాకులు తీసుకోవాల్సిన దుస్థితి రావడం.. ఈ చిత్రమైన ఘటన గుజరాత్‌లోని(Gujarat) అహ్మదాబాద్‌లో(Ahmedabad) చోటు చేసుకుంది.

న్యాయవాద(Law) వృత్తిలో 16 సంవత్సరాల అపార అనుభవం ఉందాయనకు! విడాకుల(Divorce) కోసం ఆయన దగ్గరకు వచ్చే దంపతులకు కౌన్సిలింగ్‌(Counselling) చేసి వారు మనసు మార్చుకునేలా చేయగల నేర్పరి. గమ్మత్తేమిటంటే ఎన్నో జంటలను విడిపోకుండా కాపాడిన ఈయనే భార్య నుంచి విడాకులు తీసుకోవాల్సిన దుస్థితి రావడం.. ఈ చిత్రమైన ఘటన గుజరాత్‌లోని(Gujarat) అహ్మదాబాద్‌లో(Ahmedabad) చోటు చేసుకుంది. కాసింత డిటైల్స్‌లోకి వెళదాం..గుజరాత్‌ హైకోర్టులో(Gujarat High Court) ఓ వ్యక్తి న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్నారు. 16 ఏళ్ల కాలంలో కనీసం 138 జంటలు విడాకులు తీసుకోకుండా అడ్డుకోగలిగారు.

విడాకుల కోసం వచ్చే జంటను కూర్చొబెట్టి వారికి నచ్చచెప్పి, విడిపోతే ఎంత నష్టమో వివరించి వారిలో ఉన్న విడాకుల ఆలోచనను తుడిపేసేవారు. అలాంటి ఆ న్యాయవాది భార్య(Wife) విడాకుల కోసం కేసు ఫైల్‌ చేశారు. విడాకులు కోరడం వెనుక ఉన్న కారణాలను కూడా చెప్పారామె! విడాకుల కోసం వచ్చే జంటలను విడిపోకుండా అడ్డుకోవడమే కాకుండా ఎలాంటి ఫీజులు(Fee) ఆయన తీసుకోవడం లేదట..! అది ఆర్ధిక ఇబ్బందులకు దారి తీయడం, దాని వల్ల దంపతుల మధ్య గొడవలు రావడం జరుగుతున్నాయి. అందుకే కోర్టులో కేసు పెట్టారామె! వీరిద్దరికి ఓ కూతురు ఉంది.

తల్లిదండ్రుల గొడవ కారణంగా ఈమె సరిగ్గా చదువుకోలేకపోతోంది. విడాకుల ప్రక్రియ కొనసాగుతున్న టైమ్‌లో ఆమె తల్లితో పాటే ఉండింది. విడాకులు మంజూరైన తర్వాత మాత్రం తన తండ్రే రోల్‌మోడల్‌(Role Model) అంటూ ఆయనతోనే కలిసి ఉంటానని చెప్పింది. కోర్టు కూడా ఆమె నిర్ణయానికి ఓకే చెప్పింది. తండ్రితో కలిసి ఉండేందుకు అనుమతి ఇచ్చింది.

విడాకుల కోసం వచ్చే వారి దగ్గర్నుంచి ఎందుకు ఫీజు తీసుకోవడం లేదని న్యాయవాదిని అడిగితే, దానికి చిత్రమైన కారణం చెప్పారు. ఆ న్యాయవాది కజిన్‌ విడాకులు తీసుకున్నాడట. అప్పట్నుంచి విడాకులంటే ఎలర్జీ అట. అప్పట్నుంచి ప్రాక్టీసు చేస్తున్న సమయంలో ఏ జంట విడాకుల కోసం వచ్చినా అందుకు అనుమతించకూడదని నిర్ణయించుకున్నారట! విడాకులకు వ్యతిరేకంగా ప్రచారం కూడా చేపట్టారట. పాపం 138 జంటలను ఒప్పించి విడాకులు తీసుకోకుండా అడ్డుకోగలిగిన ఆ లాయర్‌ భార్యను మాత్రం ఒప్పించలేకపోయారు.

Updated On 15 Jun 2023 6:36 AM GMT
Ehatv

Ehatv

Next Story