అపార అనుభవం ఉన్న డాక్టర్లే ఆ కేసును చూసి ఆశ్చర్యంతో కూడిన భయానికి లోనయ్యారు. వారికి దిగ్భ్రాంతి కలిగించిన ఆ కేసు వివరాలు వింటే మీరు కూడా అవాక్కవ్వడం గ్యారంటీ! మనుషులు గర్భం దాలిస్తే తొమ్మిదో నెలలో ప్రసవం జరుగుతుంది. చాలా అరుదుగా పదో నెలలో డెలివరీ అవుతుంది. కానీ ఎవరైనా 60 ఏళ్ల పాటు గర్భాన్ని మోయగలరా? అలా మోస్తూ 90 ఏళ్ల వయసులో ప్రసవిస్తారా? ఇది జరిగే పనేనా? ఈ ప్రశ్నలకు ఇంపాజిబుల్‌ అనే సమాధానం వస్తుంది.

అపార అనుభవం ఉన్న డాక్టర్లే ఆ కేసును చూసి ఆశ్చర్యంతో కూడిన భయానికి లోనయ్యారు. వారికి దిగ్భ్రాంతి కలిగించిన ఆ కేసు వివరాలు వింటే మీరు కూడా అవాక్కవ్వడం గ్యారంటీ! మనుషులు గర్భం దాలిస్తే తొమ్మిదో నెలలో ప్రసవం జరుగుతుంది. చాలా అరుదుగా పదో నెలలో డెలివరీ అవుతుంది. కానీ ఎవరైనా 60 ఏళ్ల పాటు గర్భాన్ని మోయగలరా? అలా మోస్తూ 90 ఏళ్ల వయసులో ప్రసవిస్తారా? ఇది జరిగే పనేనా? ఈ ప్రశ్నలకు ఇంపాజిబుల్‌ అనే సమాధానం వస్తుంది. కానీ పాజిబులే! ఇలాంటి వింత ఘటన చైనాలో(China) చోటుచేసుకుంది. అసలు అన్నేళ్ల పాటు గర్భంలో శిశువును(Baby) ఎలా మోయగలిగింది? డెలివరీ అయ్యాక ఆ తల్లిబిడ్డల పరిస్థితి ఏమిటి? బతికే ఉన్నారా? అన్న సందేహాలు వైద్యులనే కాసింత గందరగోళానికి గురి చేశాయి.

చైనాకు చెందిన 92 ఏళ్ల హువాంగ్‌ యిజున్‌ అనే మహిళ 1948లో గర్భం దాల్చింది. అప్పుడామె వయసు 31 ఏళ్లు. అయితే ఆ పిండం ఆమె గర్భాశయానికి వెలపల పెరుగుతోందని, ఇది ఇద్దరికి ప్రమాదమని డాక్టర్లు చెప్పారు. అబార్షన్‌ చేయించుకోవాల్సిందిగా సూచించారు. ఆ పిండం ఎదగదని, అబార్షన్‌ అవుతుందని గట్టిగా చెప్పారు. అబార్షన్‌ చేయించుకునే స్థోమత లేదు. ఆర్ధిక ఇబ్బందులు కారణంగా హువాంగ్‌(Huang) అబార్షన్‌(Abortion) చేయించుకోలేదు. భగవంతుడి మీద భారం వేసింది. ఏదైతే అదే జరుగుతుందని అనుకుంది. ఆశ్చర్యమేమిటంటే ఆమెకు ఎలాంటి నొప్పి కలగలేదు. అబార్షన్‌ అయినట్టుగా బ్లీడింగ్‌ అవ్వలేదు. తెలియకుంగానే ఆమె ఆ గర్భాన్ని అలా మోస్తూ వచ్చింది.

కడుపులోపల శిశువు బతికే ఉంటుందన్న చిన్న ఆశతో అలా 61 ఏళ్లు గడిపింది. చివరకు 90 ఏళ్ల వయసులో డాక్టర్లను ఆశ్రయించింది. వారు ఆమెకు వైద్య పరీక్షలు చేసి బిత్తరపోయారు. ఆమె చెప్పేది నిజమేనా అన్న అనుమానం కలిగి మరోసారి అన్ని రకాల టెస్టులూ చేశారు. రిజల్ట్స్‌ చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని వింత కేసు అని చెప్పారు. ఆమె గర్భంలో ఆ బిడ్డ చనిపోయి స్టోన్‌లా మారి అలా ఉండిపోయిందని తెలిపారు.

ఇలా జరగడం చాలా చాలా అరుదని అన్నారు. కాకపోతే ఎలాంటి ఇన్ఫెక్షన్‌ రాకుండా ఆమె చనిపోయిన పిండంతో అలా ఎలా ఉండిపోయిందన్నదే తెలియడం లేదని చెప్పారు. చివరకు ఆమెకు శస్త్ర చికిత్స చేసి ఆ స్టోన్‌ బేబిని బయటకు తీశారు డాక్టర్లు. వైద్య చరిత్రలో ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి సంఘటన జరగలేదని స్పష్టం చేశారు. హువాంగ్‌ యిజున్‌ కథతో పాటు ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

Updated On 19 Aug 2023 6:40 AM GMT
Ehatv

Ehatv

Next Story