మ్యాట్రిమోనీ సైట్‌లో(matrimony site) పరిచయమైన ఓ మహిళను ఎంతో నమ్మాడు.. అలా నమ్మి ఓ 27 లక్షల రూపాయలు పొగొట్టుకున్నాడు. అసలేం జరిగిందంటే..హైదరాబాద్‌ నాగోల్‌లోని(Nagole) జయపురి కాలనీకి(Jayapuri colony) చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి(government employee) మ్యాట్రిమోనీ సైట్‌ ద్వారా అనితా జోసెఫ్‌(Anitha Joseph) పేరుతో ఓ మహిళ పరిచయం అయ్యింది.

మ్యాట్రిమోనీ సైట్‌లో(matrimony site) పరిచయమైన ఓ మహిళను ఎంతో నమ్మాడు.. అలా నమ్మి ఓ 27 లక్షల రూపాయలు పొగొట్టుకున్నాడు. అసలేం జరిగిందంటే..హైదరాబాద్‌ నాగోల్‌లోని(Nagole) జయపురి కాలనీకి(Jayapuri colony) చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి(government employee) మ్యాట్రిమోనీ సైట్‌ ద్వారా అనితా జోసెఫ్‌(Anitha Joseph) పేరుతో ఓ మహిళ పరిచయం అయ్యింది. గుర్తు తెలియని నంబర్‌తో వాట్సాప్‌ చేసి పరిచయం చేసుకుంది. తన పేరు అనితా జోసెఫ్‌ అని చెప్పంది.

యూకేలో ఉంటున్నానని, డాక్టర్‌గా పని చేస్తున్నానని చెప్పుకొచ్చింది. పాపం ఆమె చెప్పిందంతా నిజమేనని నమ్మేశాడా ప్రభుత్వ ఉద్యోగి. కొన్నాళ్ల పాటు ఇద్దరూ చాటింగ్‌ చేసుకున్నారు. ఎలాగూ పెళ్లి చేసుకుంటున్నాం కాబట్టి లండన్‌నుంచి నీ కోసం ఓ గిఫ్ట్‌ పంపిస్తున్నానంటూ ఆమె చెప్పింది.

ఆ మాటలకు మనోడు బోల్డంత ఆనందపడ్డాడు. గిఫ్ట్‌ కోసం ఎదురుచూడసాగాడు. మరుసటి రోజు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ నుంచి కస్టమ్స్‌ అధికారులం మాట్లాడుతున్నామంటూ ఓ కాల్‌ వచ్చింది. మీ పేరుతో లండన్‌ నుంచి ఓ పార్శిల్‌ వచ్చిందని, అందులో బంగారు గొలుసులు(Gold Chain), కరెన్సీ(currency), ఆభరణాలు(Ornaments), విలువైన వస్తువులు ఉన్నాయని చెబుతూ కస్టమ్స్‌ క్లియరెన్స్‌ కోసం డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు.

ఇది కూడా నిజమేనని అనుకున్నాడు పాపం బాధితుడు. వారు సూచించిన ఖాతాలో డబ్బులు డిపాజిట్‌ చేశారు. తర్వాత రకరకాల రీజన్స్‌ చెబుతూ దఫదఫాలుగా 26 లక్షల 95 వేల 765 రూపాయలను వసూలు చేశారు. అక్కడితో ఆగకుండా మళ్లీ డబ్బు కావాలని అడిగారు. అప్పుడు మనోడికి డౌట్‌ వచ్చింది. ఇదేదో నిండా ముంచే బ్యాచ్‌ అని అనుకుని రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated On 15 Jun 2023 4:20 AM GMT
Ehatv

Ehatv

Next Story