Bihar Lovestory : ప్రియుడితో ఏకాంతం కోసం ఆమె ఏం చేసిందో తెలుసా?
ప్రియుడి ఎడబాటును తట్టుకోలేకపోయిందా ప్రేయసి.. కలుసుకోవడానికేమో సవాలక్ష అడ్డంకులు. పగలు రహస్యంగా కలుసుకుందామనుకున్నా ఎవరైనా చూస్తారేమోనన్న భయం! పోనీ రాత్రిపూట కలుసుకుందామనుకుంటే విద్యుత్ వెలుగులు అడ్డుపడుతున్నాయి. అందుకే ప్రియురాలు బ్రహ్మండమైన ప్లాన్ వేసింది. రాత్రి పూట కూడా ఎవరూ చూడకుండా ఉండేందుకు ఊరు మొత్తానికి కరెంట్(Current) కట్ చేయాలనే ఆలోచన చేసింది.
ప్రియుడి ఎడబాటును తట్టుకోలేకపోయిందా ప్రేయసి.. కలుసుకోవడానికేమో సవాలక్ష అడ్డంకులు. పగలు రహస్యంగా కలుసుకుందామనుకున్నా ఎవరైనా చూస్తారేమోనన్న భయం! పోనీ రాత్రిపూట కలుసుకుందామనుకుంటే విద్యుత్ వెలుగులు అడ్డుపడుతున్నాయి. అందుకే ప్రియురాలు బ్రహ్మండమైన ప్లాన్ వేసింది. రాత్రి పూట కూడా ఎవరూ చూడకుండా ఉండేందుకు ఊరు మొత్తానికి కరెంట్(Current) కట్ చేయాలనే ఆలోచన చేసింది. ఆలోచన వచ్చింతే తడవుగా అమలు చేసింది. ఈ ఘటన బీహార్‌లోని(Bihar) బేతియా జిల్లా నౌతన్ పోలీస్ స్టేషన్(Nauthan PS) పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది. ఆ గ్రామానికి చెందిన ఓ యువతి అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమించుకున్నారు. ఒకే గ్రామం కావడంతో ఇద్దరూ కలుసుకోవడం కుదిరేది కాదు. పగలు కలుస్తే ఊరి జనం కంటపడాల్సి వస్తుంది.
పైగా ఊరన్నాక కట్టుబాట్లు గట్రాలు ఉంటాయి కదా! అందుకే రాత్రి సమయంలో కలుసుకోవాలని యువతి నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ప్రియుడికి కూడా చెప్పింది. రాత్రిపూట ఎవరి కంటా పడకుండా ఉండేందుకు చక్కటి ప్లాన్ వేసింది. ప్రతి రోజూ రాత్రి పూట ఊళ్లో కరెంట్ చేసేది. ప్రియుడిని కలుసుకునే సమయానికి దగ్గరలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ చెంతకు వెళ్లి విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. ఆ చీకట్లో ప్రియుడిని కలిసేది. ఇద్దరూ ప్రేమ కబుర్లు చెప్పుకునేవారు. ఘాటుగా ప్రేమించుకునేవారు. గ్రామ ప్రజలకు ఎందుకు కరెంటు పోతున్నదో తెలిసేది కాదు. కరెంటు పోయినప్పుడు రెండు బైకులు, కరెంటు మోటార్లు, మేకలు అపహరణకు గురయ్యాయి. సరిగ్గా ఓకే సమయంలో విద్యుత్ సరఫరా ఎందుకు నిలిచిపోతున్నదో తెలుసుకోవాలనుకున్నారు. ఓ రోజు మాటు వేశారు. అప్పుడు చీకట్లో యువతి, యువకుడి ప్రేమవ్యవహారం బయటపడింది. ఆనందడోలికల్లో మునిగి తేలుతున్న ప్రేమికులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. యువకుడిని కొట్టారు. యువతిని నిలదీశారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు కుటుంబాల పెద్దలతో మాట్లాడారు. ప్రేమ జంట పెళ్లికి పెద్దలు అంగీకరించడంతో గ్రామస్తులకు కరెంట్ కోత తప్పింది.