ఓ ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురి బర్త్‌డేలు ఒకే తేదీన రావడం అసాధారణమేమీ కాదు కానీ చాలా అరుదు.. అలాంటిది ఓ కుటుంబంలోన తొమ్మిది మంది పుట్టిన రోజు ఒకే తేదీన కావడం అరుదైన విషయం.. అందుకే ఆ కుటుంబం గిన్నిస్‌ రికార్డులకెక్కింది(Guinness Record). పాకిస్థాన్లోని(Pakisthan) సింధ్‌(sindh) ప్రావిన్స్‌లో ఈ ఘనత వహించిన కుటుంబం ఉంది.

ఓ ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురి బర్త్‌డేలు ఒకే తేదీన రావడం అసాధారణమేమీ కాదు కానీ చాలా అరుదు.. అలాంటిది ఓ కుటుంబంలోన తొమ్మిది మంది పుట్టిన రోజు ఒకే తేదీన కావడం అరుదైన విషయం.. అందుకే ఆ కుటుంబం గిన్నిస్‌ రికార్డులకెక్కింది(Guinness Record). పాకిస్థాన్లోని(Pakisthan) సింధ్‌(sindh) ప్రావిన్స్‌లో ఈ ఘనత వహించిన కుటుంబం ఉంది. లర్కానా నగరానికి చెందిన అమీర్‌ అలి(Amir Ali), ఖదీజా(Khadhija) దంపతులకు 1992 ఆగస్టు 1వ తేదీన మొదటి పాప జన్మించింది. తర్వాత వరుసగా ఆరుగురు పిల్లలు ఆగస్టు 1వ తేదీనే పుట్టారు. ఇలా ఏడుగురు తోబుట్టువుల పుట్టిన రోజు ఒకే తేదీన రావడం బహు విచిత్రం. అంతకంటే గొప్ప విశేషమేమిటంటే అమీర్‌, ఖదీజా దంతపుల పుట్టిన రోజు కూడా అదే కావడం. అంతేనా.. వారి పెళ్లి రోజు కూడా ఆగస్టు ఒకటే! అందుకే ఆగస్టు 1వ తేదీ వచ్చిందంటే చాలు ఆ ఇంట్లో సంబరాలే సంబరాలు! ఎంచక్కా తొమ్మిది మంది కలిసి ఒకే కేకును కట్ చేయవచ్చు.. ఒకరికొకరు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకోవచ్చు.. ఇంతకు ముందు ఈ రికార్డు అమెరికాకు చెందిన కమిన్స్‌ ఫ్యామిలీ పేరిట ఉండింది. ఆ కుటుంబంలో అయిగురు పిల్లలు ఫిబ్రవరి 20వ తేదీన జన్మించారు.

Updated On 13 July 2023 4:18 AM GMT
Ehatv

Ehatv

Next Story