కేరళలోని(kerala) పథనంతిట్ట(Pathanthitta) జిల్లా తిరువళ్లా కోర్టు(thiruvalla Court) దగ్గర ఓ అనూహ్య సంఘటన జరిగింది. విడాకుల విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు భర్తకు నచ్చలేదు. నచ్చకపోతే పై కోర్టుకు వెళ్లవచ్చు కానీ అతడేం చేశాడంటే తనకొచ్చిన కోపాన్ని జడ్డి కారుపై చూపించాడు. కారు అద్దాలు పగలగొట్టాడు. నొక్కులు పడేలా చేశాడు. ఈ కోపానికి కారణమేమిటో తెలుసుకోవాలంటే కొంచెం ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్లాలి.

కేరళలోని(kerala) పథనంతిట్ట(Pathanthitta) జిల్లా తిరువళ్లా కోర్టు(thiruvalla Court) దగ్గర ఓ అనూహ్య సంఘటన జరిగింది. విడాకుల విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు భర్తకు నచ్చలేదు. నచ్చకపోతే పై కోర్టుకు వెళ్లవచ్చు కానీ అతడేం చేశాడంటే తనకొచ్చిన కోపాన్ని జడ్డి కారుపై చూపించాడు. కారు అద్దాలు పగలగొట్టాడు. నొక్కులు పడేలా చేశాడు. ఈ కోపానికి కారణమేమిటో తెలుసుకోవాలంటే కొంచెం ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్లాలి. ఆరేళ్ల కిందట ఓ దంపతులు విడాకుల కోసం పథనం తిట్ట కోర్టును ఆశ్రయించారు. ఆ కోర్టు తీర్పుపై తనకు నమ్మకం లేదంటూ భర్త కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. ఆ తర్వాత హైకోర్టు ఈ కేసును ఫ్యామిలీ కోర్టుకు బదిలీ చేసింది. బుధవారం కేసు విచారణ జరిగింది. ఇక్కడా మనోడు అసంతృప్తికి లోనయ్యాడు. విచారణలో తనకు న్యాయం దక్కడం లేదని భావించాడు. కోపంతో రగిలిపోయాడు. కోర్టు ఆవరణలో పార్క్‌ చేసిన జడ్జి కారు అద్దాలను పగలగొట్టాడు. కారుకు సొట్టలు పడేలా చేశాడు. వెంటనే పోలీసులు కలగచేసుకున్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే కారు తుక్కు తుక్కు అయ్యేది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. భార్యే అతడిపై విడాకుల పిటిషన్‌ దాఖలు చేసిందని చెబుతున్న పోలీసులు న్యాయవాది జడ్జి కలిసి తన గోడును సరిగా వినిపించుకోలేదన్న కోపంతో ఈ పని చేశాడని అన్నారు.

Updated On 22 Jun 2023 3:41 AM GMT
Ehatv

Ehatv

Next Story