Emotional Video On Social Media : భావోద్వేగానికి గురి చేసే వీడియో! చూస్తే కళ్లు చెమ్మగిల్లుతాయి...
సోషల్ మీడియాలో (social media)కనిపించే కొన్ని వీడియోలు మనల్ని భావోద్వేగానికి గురి చేస్తాయి. కొన్ని కంటతడి పెట్టిస్తాయి. అలాంటి ఓ వీడియోను ఢిల్లీ ఉమెన్స్ కమిషన్(Delhi women Commission) ఛైర్‌పర్సన్ స్వాతీమాలవీయ్(Swatimalawee) తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. నువ్వుండగా నాకు ఇంకేం కావాలి? ఈపాట ఒరిజనినల్ వీడియోగా ఇది ఉండాలి అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోలో జొమాటో డెలివరీ బాయ్(Zomato delivery boy) తన పని ముగించుకుని చీకటి పడిన తర్వాత భార్య, పిల్లవాడితో కలిసి ఇంటికి వెళుతుంటాడు. జొమాటో టీ షర్ట్‌ను ధరించిన ఆ వ్యక్తి ఓ పిల్లోడిని ఎత్తుకుంటాడు.
సోషల్ మీడియాలో (social media)కనిపించే కొన్ని వీడియోలు మనల్ని భావోద్వేగానికి గురి చేస్తాయి. కొన్ని కంటతడి పెట్టిస్తాయి. అలాంటి ఓ వీడియోను ఢిల్లీ ఉమెన్స్ కమిషన్(Delhi women Commission) ఛైర్‌పర్సన్ స్వాతీమాలవీయ్(Swatimalawee) తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. నువ్వుండగా నాకు ఇంకేం కావాలి? ఈపాట ఒరిజనినల్ వీడియోగా ఇది ఉండాలి అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోలో జొమాటో డెలివరీ బాయ్(Zomato delivery boy) తన పని ముగించుకుని చీకటి పడిన తర్వాత భార్య, పిల్లవాడితో కలిసి ఇంటికి వెళుతుంటాడు. జొమాటో టీ షర్ట్‌ను ధరించిన ఆ వ్యక్తి ఓ పిల్లోడిని ఎత్తుకుంటాడు. అతడి భార్య సైకిల్ హ్యాండిల్ పట్టుకుని ముందుకు నడుపుతుంటుంది. కుటుంబం కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటున్న భర్త, అతడికి చేదోడు వాదోడుగా నిలిచిన భార్యతో కూడిన ఈ వీడియో అందరినీ అమితంగా ఆకట్టుకుంటోంది. వీడియోను సునిశితంగా గమనిస్తే ఆ యువతి పిల్లవాడితో పనికి వెళ్లినట్టు అర్థమవుతోంది. భర్త సైకిల్‌పై జొమాట డెలివరీ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇద్దరూ తమ తమ పనులను ముగించుకున్న తర్వాత పిల్లోడితో కలిసి ఇంటికి వెళుతున్నారు. ఇప్పటికే లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించారు.