Nude Call Victim: న్యూడ్‌కాల్స్ మాయలో పడి 6 లక్షలు పోగొట్టుకున్న డైమండ్ వర్కర్..
న్యూడ్ కాల్స్ (Nude Calls)తో బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ బాధితుల నుంచి లక్షల్లో డబ్బులు గుంజుతున్న కథనాలు వస్తూనే ఉన్నాయి. తొలుత పరిచయం, ఫోన్‌నెంబర్లు మార్చుకొని తరుచూ మాట్లాడుతూ న్యూడ్‌కాల్స్ వరకు వ్యవహారం వెళ్లడం.. ఆ తర్వాత బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు లాగడం.. ఇప్పుడు సైబర్‌క్రైమ్ (Cyber Crime) నేరస్తుల ట్రెండింగ్ బిజినెస్ ఇదే..
న్యూడ్ కాల్స్ (Nude Calls)తో బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ బాధితుల నుంచి లక్షల్లో డబ్బులు గుంజుతున్న కథనాలు వస్తూనే ఉన్నాయి. తొలుత పరిచయం, ఫోన్‌నెంబర్లు మార్చుకొని తరుచూ మాట్లాడుతూ న్యూడ్‌కాల్స్ వరకు వ్యవహారం వెళ్లడం.. ఆ తర్వాత బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు లాగడం.. ఇప్పుడు సైబర్‌క్రైమ్ (Cyber Crime) నేరస్తుల ట్రెండింగ్ బిజినెస్ ఇదే.. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి సూరత్‌లో (Surath) చోటు చేసుకుంది. డైమండ్ వర్కర్‌తో ఫేస్‌బుక్‌లో (Face Book) పరిచయం చేసుకొని.. అతడితో న్యూడ్ వీడియో కాల్ చేయించుకొని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డ ముఠా.. దాదాపు ఆరు లక్షలు (6 Lakhs) అతని నుంచి వసూలు చేసింది. ఇంకా మరింత డబ్బు కావాలని కోరగా ఆ వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల వివరాల ప్రకారం..
సూరత్‌లో 32 ఏళ్ల డైమండ్ వర్కర్‌కు ఆగస్ట్ 13న తన ఫేస్‌బుక్‌కు పూజా శర్మ (Pooja Sharma) అనే వ్యక్తి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసిన అతను కొన్నాళ్ల చాటింగ్ తర్వాత ఇద్దరు నెంబర్లు మార్చుకున్నారు. ఫోన్‌లో తరుచూ మాట్లాడుకుంటుండేవారు. తర్వాత ఇద్దరు ఒకరినొకరు న్యూడ్ కాల్స్ చేసుకున్నారు. తర్వాత పూజాశర్మ నుంచి కాల్ కట్ అయింది. కట్‌చేస్తే మరో నెంబర్ వాట్సాప్ నుంచి తన న్యూడ్ వీడియో వచ్చింది. దీంతో బాధితుడు కంగుతిన్నాడు. బాధితుడికి ఫోన్ చేసిన ఓ వ్యక్తి తనకు తాను డీఎస్పీ సునీల్ దూబే (DSP Sunil Dube) అని చెప్పి.. ఈ వీడియో బయటకు రాకుండా ఉండాలంటే డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. వీడియోను తొలగించాలంటే.. యూట్యూబ్ నకిలీ అధికారి సంజయ్ సింగానియాతో (Sanjay Singania) మాట్లాడలని చెప్పాడు. దీంతో సైబర్ నేరగాళ్ల డిమాండ్‌కు తలొగ్గి పలుసార్లు దాదాపు ఆరు లక్షలు పోగొట్టుకున్నాడు. డబ్బు కోసం పదే పదే బెదిరించడంతో బాధితుడు సైబర్ క్రైమ్‌పోలీసులను ఆశ్రయించాడు. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.